కమలా పండు..పోషకాలు ఎన్నో..

కొంచెం తీపి, కొంచెం పులుపు

Orange.. many nutrients
Orange.. many nutrients

కాస్త తియ్యగా.. మరికాస్త పుల్లగా ఉండే కమలాపండు తింటే భలే హాయిగా ఉంటుంది రుచితోపాటు దీంట్లో పోషకాలూ ఎక్కువే..అవేమిటో తెలుసుకుందామా…

దీంట్లో సిట్రిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి1, బి6, బి12, విటమిన్‌-సి, బీటాకెరోటిన్‌ ఉంటాయి. దీంట్లోని పోషకాలు గొంతు ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. దీన్ని తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది.

దీంట్లోని విటమిన్‌-సి దగ్గూ, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాలేయం, గుండె, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది.

పొట్ట ఉబ్బరంతో బాధపడేవాళ్లు దీని తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. మూత్ర సమయంలో మంటగా ఉంటే కమలారసంతో కొబ్బరినీటిని కలిపి తాగితే మంచిదంటారు. ఇది రోగనిరోధక శక్తి పెంచుతుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/