సిఈసితో విపక్ష నేతల భేటి!

opposition party leaders
opposition party leaders

న్యూఢిల్లీ: ఈవిఎంల పనితీరు, వీవీప్యాట్‌ల వ్యవహారానికి సంబంధించి టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపి సియం చంద్రబాబు సహా 21పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు సిద్దమయ్యారు. ఈ సాయంత్రం వారంతా కేంద్ర ఎన్నికల సంఘం కమీషనర్‌ సునీల్‌ అరోరాతో భేటికానున్నారు. ఈ ఉదయం వివిప్యాట్‌ల స్లిప్పుల లెక్కింపు అంశంపై సుప్రీం విచారణ పూర్తైన వెంటనే కలవాలని అనుకున్నప్పటికీ సిఈసి అందుబాటులో లేకపోవడంతో ఆయనతో సాయంత్రం భేటీ కానున్నారు. 50 శాతం వివిప్యాట్‌ల లెక్కింపు, ఏపితో సహా పలు రాష్ట్రాల్లో ఈవిఎంల సమస్య తలెత్తడం ఎంతో తీవ్రంగా పరిగణించాల్సిన అంశమైనప్పటికి ఎన్నికల సంఘం మాత్రం కనీసం పట్టించుకోవడం లేదనే విషయాన్ని నేతలంతా ప్రశ్నించనున్నారు. దీనిపై ఈసిఐ ఎందుకు వెనకడుగు వేస్తుందనే విషయాన్ని నిలదీసే అవకాశం ఉంది. ఎన్నికల్లో తలెత్తే సమస్యలపై విపక్షాలు లేవనెత్తే అంశాలు, ఫిర్యాదులపై సరైన స్పందన లేకుండా ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తుంది.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos