ఈసీ కార్యాలయానికి వెళ్లిన ఎన్డీయేతర పక్షాల నేతలు

Opposition leaders
Opposition leaders

న్యూఢిల్లీ: కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఎన్డీయేతర పక్షాల నేతలంతా సమావేశమయ్యారు. ఆయా పార్టీకు చెందిన నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు.ఈసీ విధానాలు, మహాకూటమి గురించి చర్చించారు. అనంతరం అక్కడి నుంచి ఈసీ కార్యాలయానికి చేరుకొని ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయ్యారు.ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరుతూ ప్రతిపక్ష నేతలుఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరుతూ ప్రతిపక్ష నేతలుఒక్క పోలింగ్‌ బూత్‌లోని వీవీప్యాట్‌ స్లిప్పుల్లో తేడాలు వచ్చినా.. మొత్తం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని వీవీప్యాట్‌ స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చాలని విపక్ష నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 50శాతం వీవీప్యాట్లు లెక్కించాల్సిందేనని, దానికనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందేనని నేతలు కోరినట్లు సమాచారం. ఈసీ ఇచ్చిన సమాధానం ఆధారంగా 21 విపక్ష పార్టీల నేతలు తదుపరి కార్యాచరణను సిద్ధం చేయనున్నారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/