ప్రతిపక్షనేత సిద్దరామయ్య వెనకడుగు

siddaramaiah & yeddyurappa
siddaramaiah & yediyurappa

బెంగళూర్‌: ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ బెంగళూరుకు సంబంధించి వీరభద్రనగర్‌లో సువర్ణ భవన శంకుస్థాపన జరిగింది.ఈ సందర్భంగా నిర్వాహకులు ముఖ్యమంత్రి యడ్యూరప్పతో పాటు కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కూడా ఆహ్వానించారు. సీఎం యడియూరప్ప శంకుస్థాపనకు ఇంకా రాకముందే సిద్దరామయ్య అక్కడి చేరుకున్నారు. కాగా శంకుస్థాపనకు యడ్యూరప్ప వస్తారన్న సమాచారం తెలిసాక సిద్దరామయ్య వెనుతిరిగే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ బెంగళూరు ప్రతినిధులు సిద్దరామయ్యకు నచ్చచెప్పడంతో చివరకు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే సందర్భంలో సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వం, పాత్రికేయుల మధ్య సత్సంబంధాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. పాత్రికేయుల ఆరోగ్యం కోసం హెల్త్‌కార్డులు ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. కాగా ప్రతిపక్ష నేత సిద్దరామయ్య మాట్లాడుతూ పత్రికలు ప్రభుత్వం చేసే తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపాలని తద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.
తాజా తెలంగాణ వార్తలకోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/