ఒప్పో రెనో సిరీస్ స్మార్ట్‌ఫోన్లు 28న విడుద‌ల

OPPO Reno series smartphone
OPPO Reno series smartphone

ఒప్పో త‌న రెనో సిరీస్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ల‌ను గ‌త నెల‌లో చైనాలో విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఈ ఫోన్ల‌ను ఈ నెల 28వ తేదీన భార‌త్‌లో ఒప్పో విడుద‌ల చేయ‌నుంది. ఈ క్ర‌మంలోనే ఒప్పో సోష‌ల్ మీడియాలో ఐయామ్ రెనో పేరిట ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. కాగా ఒప్పో రెనో సిరీస్‌లో రెనో స్టాండ‌ర్డ్ ఎడిష‌న్, రెనో 10ఎక్స్ జూమ్ ఎడిష‌న్ ఫోన్లు భార‌త్‌లో విడుద‌ల కానున్నాయి. రెనో స్టాండ‌ర్డ్ వేరియెంట్‌లో 6.4 ఇంచుల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్ ఫీచ‌ర్లు ఉండ‌గా, 10ఎక్స్ జూమ్ ఎడిష‌న్‌లో 6.6 ఇంచుల డిస్‌ప్లే, 8 జీబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 48 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు.


మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/