నాలుగు కెమెరాలతో ఒప్పో కొత్త ఫోన్లు

Oppo Reno 2
Oppo Reno 2

న్యూఢిల్లీ : ప్రముఖ చైనీస్‌ మొబైల్‌ కంపెనీ ఒప్పో తమ రెనో సిరీస్‌లో 3 కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రెనో ఫోన్లకు కొనసాగింపుగా రెనో 2, రెనో 2జెడ్‌, రెనో 2 ఎఫ్‌లను ఆవిష్కరించింది. ఈ మూడు ఫోన్లలో నాలుగు రియర్‌ కెమెరాలను అమర్చడం ప్రత్యేకతగా ఆ కంపెనీ పేర్కొంది. 48 ఎంపి ప్రైమరీ సెన్సర్‌, 8 ఎంపి వైడ్‌ యాంగిల్‌ సెన్సర్‌, 13 ఎంపి టెలి ఫోటో సెన్సర్‌, 2 ఎంపి బొకే ఎఫెక్ట్‌ సెన్సర్‌లను వుపయోగించింది. ఒప్పొ రెనో 2 మోడల్‌ ధరను రూ.36,990గా కంపెనీ నిర్ణయించింది. సెప్టెంబర్‌ 20 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఇక రెనో2 జడ్‌ ఫోన్‌ ధరను రూ.29,990గా పేర్కొంది. ఇది సెప్టెంబర్‌ 6 నుంచి మార్కెట్లో అమ్మకానికి లభించనుంది. రెనో 2ఎఫ్‌ నవంబర్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీని ధరను వెల్లడించలేదు. 6.55 అంగుళాల డిస్‌ప్లే, 8జిబి ర్యామ్‌, 256 జిబి స్టోరేజ్‌, 4000 ఎంఎహెచ్‌ బ్యాటరీ రెనో2 ఫీచర్లుగా వున్నాయి.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/