మరి కొద్దిసేపట్లో బోటు వెలికితీత

బోటుకు లంగర్లు తగిలించిన డైవర్లు

ap boat accident
ap boat accident

కచ్చులూరు: ధర్మాడి సత్యం బృందం వరుస ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తున్నాయి. గోదావరిలో మునిగిపోయిన బోటు మరికాసేపట్లో బయటపడనుంది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో రాయల్ వశిష్ట అనే బోటు మునిగిపోయిన సంగతి తెలిసిందే. వరద ఉద్ధృతి, సుడిగుండాల కారణంగా ఇన్నాళ్లు దాన్ని వెలికితీయడంలో జాప్యం జరిగింది. అయితే గోదావరి శాంతించడం, సుడిగుండాల తీవ్రత కూడా తగ్గడంతో బోటు ఉన్న ప్రదేశాన్ని గుర్తించిన ధర్మాడి సత్యం బృందం బోటుకు విజయవంతంగా లంగర్లు తగిలించగలిగింది. విశాఖపట్నం నుంచి వచ్చిన డైవర్లు బోటుకు సరైన ప్రదేశాల్లో లంగర్లు ఫిక్స్ చేయగా, ఇవాళ వాటికి రెండు ఐరన్ రోప్ లు తగిలించి పొక్లెయిన్ ద్వారా బయటికి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో గంటలో బోటు వెలుపలికి వస్తుందని ధర్మాడి సత్యం బృందం భావిస్తోంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/