హృదయ విదారక దృశ్యాలు ..బోటులోనే మృతదేహాలు

బయటపడ్డ ఐదు మృతదేహాలు

Royal Vasista Boat
Royal Vasista Boat

కచ్చులూరు: కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం టీమ్ విజయవంతంగా బయటకు తీసింది. నీటి అడుగు భాగం నుంచి రోపులు, లంగర్ల సాయంతో వెలికి తీశారు. వెలికి తీసిన బోటులో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. ఇవన్నీ గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి. బోటులో మరిన్ని మృతదేహాలు ఉన్నాయి. వీటిని వెలికి తీయాల్సి ఉంది. పూర్తిగా ధ్వంసమైన స్థితిలో బోటు ఉంది. సెప్టెంబర్ 15న బోటు ప్రమాదం సంభవించింది. బోటు మునిగిన 38 రోజుల తర్వాత వెలికి తీసే ప్రయత్నాలు ఫలించాయి.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/