నిర్మల్ లో డయాలసిస్ సెంటర్ ప్రారంభం

10 పడకల కిడ్నీ డయాలసిస్‌ కేంద్రాన్నిప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

TS Minister Indrakaran Reddy
TS Minister Indrakaran Reddy

Nirmal: పేదల ఆరోగ్య రక్షణకు  టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద  చూపుతోందని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. సామాన్యులకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించాలన్నదే సిఎం కెసిఆర్‌ ఆశయమని అన్నారు.

నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఏరియా ప్రభుత్వ దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేసిన 10 పడకల కిడ్నీ డయాలసిస్‌ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,  గతంలో కిడ్నీ పేషెంట్‌లు డయాలసిస్‌ కోసం హైదరాబాద్‌ లాంటి మహా నగరాలకు వెళ్లే వారన్నారు. ఇప్పుడు నిర్మల్‌లోనే అత్యాధునిక సదుపాయాలతో డయాలసిస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొట్ట మొదటి డయాలసిస్‌ సెంటర్‌ను నిర్మల్‌ లోనే ఏర్పాటు చేసుకున్నామని, ఒక్క రోజుకు 40 మంది కిడ్నీ పేషెంట్‌లకు రూపాయి ఖర్చు లేకుండా డయాలసిస్‌ చేయొచ్చన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/specials/devotional/