జులై 1 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం కు ఆన్‌లైన్ తరగతులు

ఇంటర్ బోర్డుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు

హైదరాబాద్: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డుకు ఆదేశాలు ఇచ్చారు. జులై 5వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కళాశాలలను సిద్ధం చేసుకుని జులై 1 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు.

దూరదర్శన్, టి శాట్ ద్వారా కూడా ఆన్‌లైన్ పాఠాలను ప్రసారం చేస్తామన్నారు. గతేడాదిలానే సిలబస్ నుంచే 70 శాతం పాఠాలు ఉంటాయన్నారు. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు లేని విద్యార్థులు కళాశాలకు వచ్చి పాఠాలు వినేందుకు డిజిటల్ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించినట్టు సమాచారం.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/