ఆన్‌లైన్‌ మద్యం అమ్మకాలతో వైరస్‌ను నియంత్రించవచ్చు

లేకుంటే భౌతిక దూరం నిబంధనకు గండి

online alcohol sales
online alcohol sales

మద్యం దుకాణాలను పునఃప్రారంభించడానికి ఇటీవలే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లాక్‌డౌన్‌ లాంటి విపత్కర పరిస్థితులలో ఆర్థిక వ్యవస్థ కు నిజంగా ఊపిరి లూదినట్టయింది.

మద్యం దుకాణాలవద్ద మద్యం ప్రియుల రద్దీతో వ్యాధి వ్యాప్తి నిరోధానికి పాటించాల్సిన భౌతిక దూరానికి గండిపడుతోంది.

అంటు వ్యాధులు ప్రబలుతున్న సమ యంలో ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు దీని పూర్తి ప్రయోజనాన్ని పొందాలంటే మద్యం అమ్మకాలను ఆన్‌లైన్‌ ద్వారా జరిపేందుకు మార్గం సుగమం చేయాలి.

ఆల్కహాల్‌ ఎక్సైజ్‌ సుంకాల ద్వారా సంవత్సరానికి దాదాపు రూ. 2.48 ట్రిలియన్లు ఆర్జిస్తూ, ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారతదేశం సామర్థ్యాన్ని నిలుపుకుంటోంది.

ప్రజ లలో వారి సంప్రదాయాలలో చోటు చేసుకుంటున్న పరిణామాల మూలంగా దేశవ్యాప్త వార్షిక రేటులో బీర్‌పరిశ్రమలు ఐదుశాతం వృద్ధిని సాధించి, 2023 సంవత్సరం నాటికి మూడు బిలియన్‌ లీటర్ల ఉత్పత్తిసామర్థ్యాన్ని చేరుకోనుందని గణాంకాలు తెలుపుతున్నాయి.

అయితే సంక్లిష్ట మైన చట్టాలతోపాటు, దాదాపు 40 రోజుల పాటు వీటి అమ్మ కాలపై పూర్తి నిషేధం విధించింది . ఈ పరిశ్రమపై తీవ్ర భారంపడుతున్నప్పటికీ, దేశ ఆర్థికవ్యవస్థపై బీరుపరిశ్రమల వాస్తవప్రభావాన్ని విస్మరించలేం.

మద్యం విక్రయాలకు ప్రభుత్వం తెరతీయడంతో ఇది మద్యం పరిశ్రమలకు మాత్రమే కాకుండా ఆయారాష్ట్రాలకు సైతం లాభదాయక మైన ఆదాయ ప్రవాహాన్ని ఏర్పరిచినట్టయింది.

వాస్తవానికి, మద్యందుకాణాలను పునఃప్రారం భించిన ఒక రోజులోనే తెలం గాణాలో దాదాపు 90 కోట్ల రూపాయలకుపైగా అమ్మకాలను నమోదు చేశాయి.

అయితే దీని ప్రభావం మరెన్నో ఆదాయాలలో వృద్ధికి దోహదపడిందని ట్రేడ్‌ పండితులు తెలుపుతున్నారు.

ఏదేమైనప్పటికీ మద్యం దుకాణాల పునఃప్రారంభంతో కరోనా వ్యాప్తిని నిరోధించే భౌతికదూరం మైంటైన్‌ చేయడం సవాలుగా మారింది.

ఇప్పుడిప్పుడే వ్యాధి వ్యాప్తి తగ్గుతున్న సమయంలో మద్యం దుకాణాల వద్ద కనీస నిబంధనలు పాటించలేని స్థితి మూలంగా మళ్లీ వ్యాధి పెద్ద ఎత్తున వ్యాప్తి చెందదని గ్యారంటీ ఏమిటి? మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటనే ప్రశ్న ఉదయించవచ్చు.

ఆల్కహాల్‌ కంటెంట్‌ తక్కువగల బీరు, వైన్‌ వంటి పానీయాలను ఆన్‌లైన్‌లో విక్రయి స్తే మద్యం దుకాణాల వద్ద రద్దీ గణనీయంగా తగ్గి భౌతిక దూరం మైంటైన్‌ చేయడం సులభం అవుతుంది.

ఈ మార్పు రాష్ట్రాల ఆదాయాలకు, అలాగే మద్యం వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉపకరిస్తుందనడంలో సందేహం లేదు.

-శ్రీనివాస్‌ గుండోజు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/