దేశవ్యాప్తంగా మండుతున్న ఉల్లి మంటలు

Onions
Onions

పనాజీ : ఉల్లి ధరలు వరుసగా రెండో వారంలోనూ ఆకాశానంటుతున్నాయి. ఒకపక్క కేంద్రప్రభుత్వం ఉల్లిధరలు తగ్గించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది, అయినా ధరలు ఏ మాత్రం దిగిరావట్లేదు. ఈ సారి రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభం కావడం మూలంగా ఉల్లిని పండించే రాష్ట్రాల్లో అధిక వర్షాలు పడడంతో పంటదెబ్బతిని దేశంలో కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎగుమతులను పూర్తిగా నిషేధించింది, అంతేకాకుండా విదేశాలనుంచి అధిక మొత్తంలో దిగుమతికి ఏర్పాట్లు చేస్తుంది. కాగా ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో ఉల్లి ధర సగటున రూ. 100కు పైగా పలుకుతుంది. గోవా రాజధాని పనాజీలో అత్యధికంగా కిలో ఉల్లి రూ. 165 కాగా అత్యల్పంగా ఢిల్లీలో రూ. 96గా ఉంది. ఇక బెంగళూరు, కోల్‌కతాలో రూ.140 ఉండగా, ముంబయిలో రూ. 102 చొప్పున ఉంది. కాగా కేంద్రం చిల్లర వర్తకులను ఉల్లి నిల్వ రెండు టన్నులకు మించి సామర్థ్యం ఉండకూడదని ఆదేశించింది. జనవరి వరకు ఇదే విధంగా ధరలు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/