ఉల్లి ధర తగ్గుముఖం

Onions
Onions

కర్నూలు: గత కొంత కాలంగా ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లి కొనాలంటే ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. అయితే తాజాగా కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లి క్వింటాకు రూ. 8,600 పలికింది. ఈ ధర తగ్గుముఖం పట్టేందుకుగాను ఏపిలో అధికారులు రాష్ట్ర అవసరాలు తీరుకుండా పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేయకూడదని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిలిపివేయడంతో ఏపిలో ఉల్లి ధరలు తగ్గినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా అక్రమంగా తరలిస్తున్న ఉల్లి లారీలను సైతం విజిలెన్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ధరలు తగ్గుముఖం పట్టినట్లు సమాచారం.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/