ఉల్లి చేసే మేలు

ఆహారం-ఆరోగ్యం

Onion-Health benefits
Onion-Health benefits

వంటల్లో ఉల్లిగడ్డలను, ఉల్లికాడలను విరివిగా ఉపయోగిస్తారు ఎందుకంటే ఉల్లి చేసే మేలు అలాంటిది. ఒక వేసవికాలంలోనైతే దీని విలువ చెప్పనవసరం లేదు.

వంటల్లోనే కాక విడిగా పచ్చి ఉల్లిడడ్డ ముక్కలను కూడా ఎక్కువగా తీసుకుంటారు.

కొన్ని ప్రాంతాల్లో మండే ఎండల్లో వడదెబ్బ నుండి రక్షణకు పిల్లల మెడలో ఉల్లిగడ్డలను మాలగా గుచ్చి వేస్తారు.

పెద్దవారైతే ఎండలో బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఉల్లిగడ్డను తలపై ఉంచుకుని టోపీ పెట్టుకుంటారు. అలాగే అలాగే చిన్నపిల్లల్లో, పెద్దవారిలో నిద్రలేమిని ఇట్టేమాయం చేసే ఉల్లి ఆరోగ్యానికే కాదు సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది.

ముక్కులో నుండి రక్తం కారుతుంటే ఉల్లిగడ్డను మధ్యలోకి కోసి కాసేపు వాసన చూస్తే సరి. మూర్ఛతో బాఢపడుతున్నప్పుడు ఉల్లి రసాన్ని రెండు మూడు చుక్కలు ముక్కులో వేస్తే వెంటనే తేరుకుంటారు.

మొటిమలు, వాటి తాలూకు మచ్చలకు ఉల్లిపాయరసం, ఆలివ్‌ ఆయిల్‌ సమపాళ్లలో కలుపుకున్న మిశ్రమం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.

చుండ్రు సమస్య వేధిస్తుంటే ఉల్లి రసం తలకు బాగా పట్టించాలి. ఇది చుండ్రు లేకుండా చేయడంతో పాటు జుట్టు పెరగడానికి దోహదం చేస్తుంది.

కీటకాలు, కుక్కకాటుకు ఉల్లిరసం తీసుకోవడం, ఉల్లిగడ్డను దంచి గాయంపై పూసినా మంట తగ్గుతుంది. విషాన్ని హరిస్తుంది.

ఎంతగా బాధించే నొప్పులకైనా ఉల్లిరసం, ఆవనూనె సమంగా కలిపి మర్దన చేస్తే చాలు వెంటనే ఉపశమనం లభిస్తుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/