భగ్గుమంటున్న రైతుల నిరసనలు

కర్రలతో దాడి చేసిన అద్దాలను పగలగొట్టిన రైతులు

protests
protests

అమరావతి: ఏపిలో మూడు రాజధానులపై అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. రాజధానిని ఇక్కడే కొనసాగించాలని ఆందోళనను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో ఉద్దండరాయునిపాలెంలో సచివాలయానికి వెళ్తున్న ఓ మీడియా వాహనంపై నిరసనకారులు దాడి చేశారు. కర్రలతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారులో ఉన్నవారిపై దాడి చేశారు. మరోవైపు కారును వెనక్కి మళ్లిస్తున్న తరుణంలో ఓ బైక్ ను కారు ఢీకొంది. అక్కడే ఉన్న పోలీసులు కలగజేసుకుని మీడియా వాహనం అక్కడి నుంచి వెనక్కి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్ ఉన్నప్పటికీ ఈ దాడి జరగడం గమనార్హం. కొన్ని మీడియా సంస్థలు అమరావతి రైతులకు వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తున్నారనే ఆగ్రహంతో ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/