6.5% పెరిగిన ఒఎన్‌జిసి ఉత్పత్తి

ONGC
ONGC


ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌( ఒఎన్‌జిసి) గత ఏడాది ఆర్థికసంవత్సరంలో ఉత్పత్తి చేసిన గ్యాస్‌ 6.5శాతం పెరిగింది. కానీ ఈ సారి రికార్డుస్థాయిలో పెరుగుదల కనిపించింది. 2018-19ఆర్థిక సంవత్సరానికి గాను 25.9బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసింది. ఈ పెరుగుదల గ్లోబల్‌ యావరేజ్‌ కంటే ఎక్కువగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 24.61బిసిఎంలుగా ఉన్న ఉత్పత్తి 2018-19లో 25.9బిసిఎంలకు చేరింది. గతంలో ఎప్పుడూ ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంత పెద్దమొత్తంలో ఒఎన్‌జిసి ఉత్పతిఉ్త పెరగలేదు. పెరిగిన ఉత్పత్తిలో ఎక్కువ భాగం కంపెనీకి నామినేషన్‌ పద్ధతిపై కేటాయించిన క్షేత్రాల నుంచి వచ్చింది. కొత్త క్షేత్రాలతోపాటు పాత క్షేత్రాల్లోనూ ఉత్పత్తి పెంచేందుకు అధునాతన పద్ధతులు ఉపయోగిస్తున్నారు. 2022 నాటికి దేశ చమురు దిగుమతులు పది శాతం మేర తగ్గించాలన్న ప్రధాన నరేంద్రమోడీ లక్ష్యం మేరకు దేశంలో గ్యాస్‌ ఉత్పత్తి పెంచేందుకు ఒఎన్‌జిసి కసరత్తు చేస్తోంది. గతంలో కంటే గ్యాస్‌ ఉత్పత్తి పెరిగిందని ఒఎన్‌జిఎస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శశిశంకర్‌ తెలిపారు. 2022 నాటికి 42 బిసిఎం ఉత్పత్తి చేయాలని ఒఎన్‌జిసి లక్ష్యంగా పెట్టుకుంది. అప్పటికి ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని కేజి బేసిన్‌లో ఉత్పత్తి అందుబాటులో ఉంటుందన్నారు. ఈ ఏడాది చివరినాటికల్లా కేజి బేసిన్‌లో గ్యాస్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. 2022 నాటికిఇక్కడ రోజువారీ ఉత్పత్తి 1.65కోట్ల ప్రామాణిక ఘనపు మీటర్లకు చేరుకుంటుందని, దేశంలో గ్యాస్‌ ఉత్పత్తి పెంచేందుకు రూ.57వేలకోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. ఇందులో ఎక్కువ భాగం కేజి బేసిన్‌, పశ్చిమ తీరంలో ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే మూడేళ్లలో దేశంలోని వివిధ బేసిన్‌ల నుంచి 42 బిసిఎంల గ్యాస్‌ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పటికి కేజి బేసిన్‌లో గ్యాస్‌ ఉత్పతి గరిష్టస్థాయికి చేరుకుని ఇందుకు తోడ్పడుతుందని భావిస్తున్నారు. ప్రపంచంలో నేచురల్‌ గ్యాస్‌ ఉపయోగం వేగంగా పెరుగుతోంది. గ్రీన్‌ హౌస్‌ ఉద్ఘాకాల ఉపయోగాన్ని తగ్గించాలని భారత్‌ ప్రయత్నాలుచేస్తోంది. ఇందులో భాగంగా నేచురల్‌ గ్యాస్‌ ఉపయోగం పెంచుతోంది. 2030 నాటికి మరో 15 శాతం వాటాను పెంచాలని చూస్తోంది.

తాజా ఆధ్యాత్మికం వివరాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/devotional/