మెయిన్​పురి ఉప ఎన్నిక.. మాజీ సైనికుల మద్దతు కోరిన అఖిలేష్​

akhilesh-yadav

లక్నోః అగ్నిపథ్​ పథకంపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్​ యాదవ్​ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశానికి సేవ చేయాలనుకునే వ్యక్తి ఎప్పటికీ అగ్నివీరుడు కాలేడని అన్నారు. ఉత్తరప్రదేశ్​లోని ఫరూఖాబాద్​ లో ఆర్మీ రిక్రూట్ మెంట్ లు జరిగాయి. కానీ ఎవరికీ ఉద్యోగం రాలేదన్నారు. ఇలాంటి పథకాల ద్వారా బడ్జెట్​ ను ఆదా చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని.. అయితే దేశమే మనుగడ సాగించనప్పుడు.. బడ్జెట్ ఎలా మనుగడ సాగిస్తుందని ప్రశ్నించారు.

మెయిన్‌పురిలో మాజీ సైనికుల సదస్సులో ప్రసంగించిన అఖిలేష్​ యాదవ్​.. సమాజ్ వాదీ పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. మాజీ సైనికులు తమకు మద్దతు ఇస్తే ఎస్పీకి తిరుగుండదని చెప్పారు. అక్టోబర్​ 10న ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్​ యాదవ్​ మరణంతో ఆ పార్టీకి కంచుకోటగా భావించే మెయిన్​పురి స్థానానికి డిసెంబర్​ 5వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఎస్పీ అభ్యర్థిగా అఖిలేష్​ భార్య డింపుల్​ యాదవ్​ పోటీ చేస్తున్నారు. మెయిన్​ పురిలో ఎస్పీ ఘన విజయం సాధిస్తుందని అఖిలేష్​ ధీమా వ్యక్తం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/