మెయిన్‌పురి ఉప ఎన్నిక.. మాజీ సైనికుల మద్దతు కోరిన అఖిలేష్
లక్నోః అగ్నిపథ్ పథకంపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశానికి సేవ చేయాలనుకునే వ్యక్తి ఎప్పటికీ అగ్నివీరుడు కాలేడని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ లో ఆర్మీ రిక్రూట్ మెంట్ లు జరిగాయి. కానీ ఎవరికీ ఉద్యోగం రాలేదన్నారు. ఇలాంటి పథకాల ద్వారా బడ్జెట్ ను ఆదా చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని.. అయితే దేశమే మనుగడ సాగించనప్పుడు.. బడ్జెట్ ఎలా మనుగడ సాగిస్తుందని ప్రశ్నించారు.
మెయిన్‌పురిలో మాజీ సైనికుల సదస్సులో ప్రసంగించిన అఖిలేష్ యాదవ్.. సమాజ్ వాదీ పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. మాజీ సైనికులు తమకు మద్దతు ఇస్తే ఎస్పీకి తిరుగుండదని చెప్పారు. అక్టోబర్ 10న ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ మరణంతో ఆ పార్టీకి కంచుకోటగా భావించే మెయిన్‌పురి స్థానానికి డిసెంబర్ 5వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఎస్పీ అభ్యర్థిగా అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. మెయిన్ పురిలో ఎస్పీ ఘన విజయం సాధిస్తుందని అఖిలేష్ ధీమా వ్యక్తం చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/