సిబిఐలో మరోమలుపు!

m k sinha
m k sinha

ఆస్తానా కేసులో నాపై ముగ్గురు ప్రముఖుల ఒత్తిడి
సివిసి చౌదరి, ఎన్‌ఎస్‌ఎ అజిత్‌దోవల్‌ కేంద్రమంత్రి హరిభా§్‌ులప్రమేయం
సుప్రీంకోర్టుకు సిబిఐ డిఐజి ఎంకె సిన్హా పిటిషన్‌
న్యూఢిల్లీ: సిబిఐ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్తానాకేసు దర్యాప్తుచేస్తున్న సిబిఐ అధికారి ఎంకె సిన్హా అత్యున్నతస్థాయి దర్యాప్తు సంస్థల అధికారులతోపాటు కేంద్ర సహాయ మంత్రి సైతం దర్యాప్తునకు అడ్డుపడుతున్నారని వారి పేర్లతోస హా కోర్టుకు నివేదించారు. అంతేకాకుండా అందువల్లనే తనను నాగ్‌పూర్‌కు బదిలీచేసారని సుప్రీంకోర్టుకు ప్రత్యేక పిటిషన్‌ దాఖలుచేసారు. సిబిఐలోని సీనియర్‌ అధికారి ఎంకె సిన్హా జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్‌, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ కెవిచౌదరి, కేంద్రమంత్రి హరిభా§్‌ుప్రతిభా§్‌ు చౌదరిపేర్లను తన పిటిషన్‌లో ఉదహరించారు. సిబిఐ స్పెషల్‌డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్తానా ప్రస్తుతం విధులనుంచి రిలీవ్‌ అయి సెలవుపై వెళ్లాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. పిఎన్‌బి కుంభకోణం కేసు, నీరవ్‌మోడీ వంటి బడా వ్యక్తులకేసులు దర్యాప్తుచేసిన ఎంకె సిన్హా మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేస్తే తన నాగ్‌పూర్‌ బదిలీని రద్దుచేయాలని కోరారు. ఆయన న్యాయవాది సునీల్‌ ఫెర్నాండెజ్‌ సిన్హా తరపున హాజరై ముగ్గురుసభ్యులున్న సుప్రీం బెంచ్‌కు పిటిషన్‌ అందించారు. చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌గగో§్‌ు అధ్యక్షతన ఉనన బెంచ్‌పై తన సమాచారాన్ని వివరిస్తూ తన పిటిషన్‌ను అత్యవసర విచారణ చేయాలని సిబిఐ డైరెక్టర్‌ అలోక్‌వర్మ పిటిషన్‌తోపాటే విచారించాలని అభ్యర్ధించారు. తన క్లయింట్‌వద్ద షాకింగ్‌ సమాచారం ఉందన్న న్యాయవాది అభ్యర్ధనను సుప్రీం తిప్పికొడుతూ తమను ఏమీ ఆశ్చర్యపరచలేదని బెంచ్‌ వ్యాఖ్యానించింది. జస్టిస్‌ ఎస్‌కె కౌల్‌, జెస్టిస్‌ కెఎంజోసెఫ్‌లు ఈ పిటిషన్‌ను తిరస్కరించి అత్యవసర విచారణచేయబోమని స్పష్టంచేసారు. వర్మ అభ్యర్ధన వింటున్న తరుణంలోనే కోర్టుకు హాజరుకావాలని బెంచ్‌ స్పష్టంచేసింది. నాగ్‌పూర్‌కు తనను బదిలీచేయడంద్వారా ఆస్తానాకు వ్యతిరేకంగా దాఖలైన కేసులు దర్యాప్తునుంచి తనను తప్పించడంకోసమే బదిలీచేసారన్నారు. తన బదిలీ ఏకపక్షంగా జరిగిందని, కుట్రపూరితమైన, స్వార్ధప్రయోజనాలకోసమే చేసారని, కొందరు శక్తివంతమైన వ్యక్తులకు సంబంధించిన సమాచారం తెలిసినందున విచారణ అధికారిని బలిపశువుచేసేందుకు తనను బదిలీచేసారన్నారు. తన 34 పేజీల పిటిషన్‌లో సిన్హా సిబిఐ డైరెక్టర్‌ ఎన్‌ఎస్‌ఎ సలహాదారు దోవల్‌కు అక్టోబరు 17న సంక్షిప్తంగా వివరించి ఆస్తానాపై కేసు నమోదుచేస్తున్నట్లు వెల్లడించారన్నారు. అదేరోజు రాత్రి ఎన్‌ఎస్‌ రాకేష్‌ ఆస్తానాకు కేసు నమోదు అంశం చెప్పిందన్నారు. దీనితో ఆస్తానా కూడా తనను అరెస్టుకాకుండ ఆచూడాలన ఇఎన్‌ఎస్‌ఎకు పదేపదేచెప్పారన్నారు. 2000వ సంవత్సరం ఐపిఎస్‌ బ్యాచ్‌ అధికారి అయిన సిన్హా దర్యాప్తుల్లో పేరున్న వ్యక్తి.ఇపుడు ఆయనదాఖలుచేసిన పిటిషన్‌ తీవ్రసంచలనం కలిగించింది. అలాగే సిబిఐ డిఎస్‌పి ఎకెబస్సి దాఖలుచేసిన అఫిడవిట్‌కు సైతం మద్దతిచ్చారు. బస్సిని అండమాన్‌ నికోబార్‌ దీవులకు బదిలీచేసిన సంగతి తెలిసిందే. ఈ బదిలీ కొంతరు ప్రభుత్వ అధికారులకు మేలుచేయడంకోసమే చేసారన్నారు. ఆస్తానకుసంబంధించిన లంచం కేసుల్లో ఉన్న ఉద్యోగులమేలుకోసమే బస్సిని బదిలీచేసారన్నారు. సిబిఐ డైరెక్టర్‌ ఆస్తానా ఇల్లుసోదాచేయడానికి, ఆయన మొబైల్‌ఫోన్‌ స్వాధీనంచేసుకుని పరిశీలించేందుకుసైతం సిబిఐ డైరెక్టర్‌తనకు అనుమతివ్వలేదని, ఎన్‌ఎస్‌ అనుమతి ఇవ్వలేదని చెప్పారని పిటిషన్‌లోపేర్కొన్నారు. మాంసం వ్యాపారి మోయిన్‌ఖురేషికేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై మనోజ్‌ప్రసాద్‌నుంచి ఆస్తానా లంచం స్వీకరించారన్న ఆరోపణలపై సిబిఐ ఆస్తానాపై కేసు నమోదుచేసింది. మనోజ్‌ప్రసాద్‌నున విచారించిన తర్వాత ఆస్తానా కేసులో ఉన్నారని వెల్లడిస్తూ ఎన్‌ఎస్‌ఎ అజిత్‌దోవల్‌, రా అదనపు ప్రత్యేక డైరెక్టర్‌ సామంత్‌కుమార్లపేరును సైతం ఉదహరించారు. మనోజ్‌ప్రసాద్‌కు సంబంధించి ఆతని తండ్రి దినేశ్వర్‌ప్రసాద్‌ రిటైర్డ్‌ జాయింట్‌ సెక్రటరీ అని దోవల్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయన్నారు. మనోజ్‌ప్రసాద్‌ తనను సిబిఐ కేంద్రకార్యాలయానికి తీసుకువచ్చిన మొదటిరోజే తనను ఎలా తీసుకొస్తారని ఆగ్రహం వ్యక్తంచేసారని, అజిత్‌దోవల్‌తో తనకు సన్నిహిత బంధం ఉందని చెప్పాడని సిన్హా వెల్లడించాడు.అంతేకాకుండామనోజ్‌ సిబిఐ అధికారులను సైతం పరిమితుల్లో ఉండాలని ఆదేశించేవాడన్నారు. గతనెల 20వ తేదీ డిప్యూటి ఎస్‌పి దేవేందర్‌కుమార్‌ నివాసంపై దాడులుచేసామని దాడులు జరుగుతున్నపుడే తనకు సిబిఐ డైరెక్టర్‌నుంచి సోదాలు నిలిపివేయాలని మొబైల్‌ఫోన్‌ ఆదేశాలు వచ్చాయన్నారు. తాను ఆసమయంలో బిఎస్‌ఎఫ్‌ అండ్‌సి ఆఫీసులో ఉన్నానని, తాను డైరెక్టర్‌ను ప్రశ్నించానని ఎన్‌ఎస్‌ఎ దోవల్‌నుంచి వచ్చిందని చెప్పారన్నారు. అంతేకాకుండా మధ్యవర్తి సతీష్‌బాబుసానా విచారణలో జూన్‌ 2018 ప్రాంతంలో కొన్ని కోట్ల రూపాయలు కేంద్రమంత్రి హరిభా§్‌ుప్రతిభా§్‌ుచౌదరికి అందచేసినట్లు తెలిపాడన్నారు. ప్రస్తుతం చౌదరి బొగ్గుశాఖ మంత్రిగా ఉన్నారు. సిబిఐ సీనియర అధికారులతోప్రమేయం ఉన్న హరిభా§్‌ు ఆసమయంలో మానవవనరులు ర్సనల్‌శాఖమంత్రిగా ఉన్నారు. అహ్మదాబాద్‌కు చెందిన విపుల్‌ద్వారా చెల్లించానన్నారు. గతనెల 20వ తేదీ మధ్యాహ్నం సతీష్‌తనకు ఈ వివరాలుచెప్పాడని సిన్హా వెల్లడించారు. ప్రస్తుతం సిబిఐ అవినీతినిరోధక విభాగం నాగ్‌పూర్‌శాఖలో డిఐజిగా ఉన్నారు. తాను సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ కెవిచౌదరిని గోరంట్ల రమేస్‌తో కలిసి ఢిల్లీలో కలిసి మోయిన్‌ఖురేషి కేసువిషయమై చర్చలుజరిపామన్నారు. సానా వివరాలప్రకారం సివిసి చౌదరి ఆస్తానాను తన నివాసానికి పిలిచి వివరాలడిగరాన్నరు. సివిసికి ఆస్తానా సమాచారం ఇచ్చారని అయితే ఈ విషయమై సాక్ష్యాలు అంతగా లేవన్నారని తెలిపారన్నారు. సిన్హా తన పిటిషన్‌లో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సురేష్‌ చంద్ర కూడా సానాను సంప్రదింపులు జరిపారని అలోక్‌వర్మకు వ్యతిరేకంగా సివిసి విచారణజరుగుతున్న సమయంలో సానాతోమాట్లాడారన్నారు. అయితే సురేష్‌చంద్ర ఈ ఆరోపణలను ఖండించారు. ప్రస్తుతం డిఐజి సిన్హా చేసిన ఆరోపణలు అటు సుప్రీంలోనే కాదు దేశవ్యాప్తంగా తీవ్రసంచలనం కలిగిస్తున్నాయి.