అమరావతి కోసం లక్ష కోట్లు పెట్టడం సాధ్యంకాదు

IYR Krishna Rao
IYR Krishna Rao

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేయగలమా అనేదే రాజధాని చర్చలో ప్రధాన అంశమని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 33వేల ఎకరాల్లో ప్రభుత్వం చేతికి వచ్చే 10వేల ఎకరాలకు విలువ రావాలన్నా ముందుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టబడులు పెట్టాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇక రాజధాని విషయంలో లక్షకోట్లు పెట్టుబడి సాధ్యమయ్యే విషయం కాదని తెలిపారు. అదే సమయంలో విశాఖ పట్టణంను రాజధానిగా ఆయన సమర్థించారు. ఒక వెయ్యి కోట్లతో విశాఖ పట్టణంలో రాజధానికి కావల్సిన భవనాలు నిర్మించుకొని 10వేల కోట్లు ఒక ప్రణాళిక ప్రకారం విశాఖ నగరంపై ఖర్చుపెడితే ఆ నగరాన్ని దేశంలోనే కాదు ప్రపంచలోనే ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దుకునే అవకాశాలు ఉన్నాయని ఐవైఆర్‌ వివరిస్తూ ట్వీట్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/