శ్రీలంకలో కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం

curfew in sri lanka
curfew in sri lanka

కొలంబో: శ్రీలంకలో ఆదివారం సాయంత్రం చెలరేగిన ముస్లిం వ్యతిరేక ఘర్షణల కారణంగా ఒక వ్యక్తి మృతి చెందాడు. అక్కడ అల్లర్లు రోజురోజుకి తీవ్ర రూపం దాలుస్తుండటంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. అయిన కూడా అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం పుట్టలం జిల్లాలో జరిగిన అల్లర్లు సోమవారం సాయంత్రానికి కొలంబో సరిహద్దులోని మరో మూడు జిల్లాలకు వ్యాప్తించాయి. ఆదివారం పలు ముస్లిం వ్యాపారుల దుకాణాలే లక్ష్యంగా ప్రారంభమైన దాడుల్లో తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం చెలరేగుతున్న అల్లర్ల ధాటికి మరణించిన తొలి వ్యక్తి ఇతనే అని అక్కడి పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనలపై స్పందించిన ఆ దేశ ప్రధాని రణిల్‌ విక్రమసింఘే.. దేశంలో అస్థిరతను సృష్టించడం కోసం కొన్ని అసాంఘిక శక్తులు కుట్ర పన్నుతున్నాయన్నారు. అందులో భాగంగానే ఈ గొడవలు జరుగుతున్నాయన్నారు. వీటిని అదుపులోకి తీసుకురావడానికి కర్య్ఫూ విధిస్తున్నామన్నారు. పోలీసు, భద్రతా సిబ్బంది ఎంత ప్రయత్నించినా.. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా మూకలు సాగుతున్నాయని తెలిపారు.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/