నది లోపలికి పంపిన లంగర్లకు తాకిన బలమైన వస్తువు

దీనిని బయటకు లాగుతోన్న ధర్మాడి సత్యం బృందం

godavari-boat
godavari-boat

తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. బోటును వెలికితీసేందుకు నది లోపలికి పంపిన లంగర్లకు బలమైన వస్తువు తగిలింది. ధర్మాడి సత్యం నేతృత్వంలోని బృందం ఈ వస్తువును బయటకు లాగుతోంది. ఆ వస్తువు మునిగిపోయిన బోటు అని భావిస్తున్నారు. మునిగిపోయిన బోటును సాయంత్రంలోగా బయటకు తీస్తామని బృందంలోని సభ్యులు చెబుతున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/