మరోసారి గోదారి బోటు వెలికీతీత పనుల ప్రారంభం

Godavari boat
Godavari boat

దేవీపట్న: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ఇటివల బోటు మునిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ బోటును వెలికి తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నదిలో వరద ఉద్ధృతి తగ్గడంతో కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం బోటును బయటకు తీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనికి అవసరమైన సామగ్రిని దేవీపట్నం పోలీస్‌స్టేషన్‌ నుండి సంఘటన స్థలికి తరలించారు. ఇటివల మూడు రోజుల పాటు నదిలో లంగర్లువేసి బోటును వెలికతీసేందుకు ప్రయత్నించినప్పటికి ఫలితం దక్కలేదు. ఈ సందర్భంగా నాలుగో రోజు గాలింపు చర్యలు చేపడదామన్నా గోదావరిలో వరద ప్రవాహం పెరగడంతో అధికారుల ఆదేశాల మేరకు గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. తాజాగా కలెక్టర్‌ ఆదేశాల మేకు వెలికితీత పనులను పునఃప్రారంభించినట్లు సత్యం తెలిపారు. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 38 మృతదేహాలను అధికారులు గుర్తించగా, మరో 13 మృతదేహాల ఆచూకీ లభించాల్సి ఉంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/