మరోసారి ప్రభాస్ తో కట్టప్ప..?

మరోసారి ప్రభాస్ – కట్టప్ప లు కలిసి నటించబోతున్నారు. మిర్చి మూవీ లో ప్రభాస్ తండ్రి గా, బాహుబలి చిత్రంలో ప్రభాస్ మామ గా నటించి అందర్నీ మెప్పించాడు సత్యరాజ్. ఇక ఇప్పుడు మరోసారి ప్రభాస్ తో కనిపించబోతున్నాడు. కాకపోతే ఈసారి ప్రభాస్ కు తాత గా కనిపించబోతున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో మారుతీ సినిమా ఒకటి. హర్రర్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కి రాజా డీలక్స్ అనే పేరు పరిశీలన లో ఉంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకోవడం జరిగింది. కాగా ఈ మూవీ లో సత్య రాజ్ ..ప్రభాస్ కు తాత గా కనిపించబోతున్నట్లు ఓ వార్త ఫిలిం సర్కిల్లో వైరల్ గా మారింది. మరి ఈ వార్త ఎంత నిజమో తెలియదు కానీ అభిమానులు మాత్రం ఇప్పటికే నుండే సంబరాలు చేసుకుంటున్నారు.

లిమిటెడ్ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని అతి తక్కువ సమయంలో పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నారట దర్శక నిర్మాతలు. అది కూడా తక్కువ రోజుల్లోనే సినిమాను పూర్తి చేసి ఈ ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ , మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.