మరోసారి ‘అల వైకుంఠపురంలో ‘ కాంబో

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో మరో మూవీ రాబోతుంది. జులాయి , సన్ అఫ్ సత్యమూర్తి , అల వైకుంఠపురంలో చిత్రాలు వచ్చి హ్యాట్రిక్ విజయాలు సాదించాయి. దీంతో ఇప్పుడు మరోసారి వీరి కాంబో అనగానే అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. అలవైకుంఠపురంలో చిత్రాన్ని నిర్మించిన గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు మరోసారి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

ఇక వచ్చే ఏడాది నుంచి సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా పూజా హెగ్డే , శ్రీ లీల కథనాయికలుగా త్రివిక్రమ్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శెరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్నట్లు సమాచారం.