ఢిల్లీ ఎన్నికల్లో మహిళలు తప్పక ఓటేయండి

ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విన్నపం

Arvind Kejriwal
Arvind Kejriwal

న్యూ ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో అందరూ ఓటు వెయ్యాలనీ, ముఖ్యంగా మహిళలంతా తప్పక ఓటు వెయ్యాలని పిలుపిచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. తన ఓటు వేసే ముందు తన తల్లిదండ్రుల కాళ్లకు మొక్కి వారి ఆశీర్వాదం తీసుకున్న ఆయన… ఆ తర్వాత… రాజ్‌పూర్ రోడ్డులోని రాజ్‌పురా స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ దగ్గరున్న పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… భవిష్యత్తు తరాల కోసం ప్రతి ఒక్కరూ ఓటు వెయ్యాలని కోరారు. ముఖ్యంగా మహిళలంతా తప్పకుండా ఓటు వేయాలని ఆయన ఓటర్లకు సూచించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/