రాహుల్‌కు మోది జన్మదిన శుభాకాంక్షలు

rahul gandhi
rahul gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మోది ట్విట్టర్‌ ద్వారా బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. మంచి ఆరోగ్యంతో పాటు దేవుడు ఆయనకు దీర్ఘాయుష్షును ప్రసాదించాలని కోరుకుంటున్నారు అని మోది ట్వీట్‌ చేశారు.
అలాగే రాహుల్‌కు కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/