27న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమల: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి 27న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన 300 దర్శన టికెట్ల కోటాను ఈనెల 27న ఉదయం 11గంటలకు వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు తితిదే వెల్లడించింది. ఈ మేరకు భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.