ఓమిక్రాన్ అలర్ట్ : తెలంగాణ వచ్చిన వారిలో 11 మందికి కరోనా

కరోనా మహమ్మారి ఉదృతి తగ్గిందని అనుకునే లోపే మరో కొత్త వేరియంట్ బయటకొచ్చింది. ఒమిక్రాన్‌ అనే వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా సహా పలు ఆఫ్రికా దేశాల నుంచి విదేశీయులు రావొద్దని బ్రిటన్‌తో పాటు, అమెరికా, రష్యా, జపాన్‌, ఆస్ట్రేలియాలు కూడా ప్రకటించాయి.

ఇదిలా ఉంటె..ఇటీవల మూడురోజుల నుంచి ఓమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచే కాకుండా కరోనా రిస్క్ ఉన్న12 దేశాల నుంచి వచ్చిన వారిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. వీరందరికి కరోనా టెస్టులు కూడా చేసింది. రీసెంట్ గా దక్షిణాఫ్రికా నుంచి 185 మంది, బోట్స్ వానా నుంచి 16 మంది తెలంగాణకు వచ్చారు. వీరందరికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగా… 11 మందికి కరోనా సోకిందని తేలింది. అయితే వీరందరికి ఏ వేరియంట్ కరోనా సోకిందో తెలియాల్సి ఉంది. వీరందరి నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించారు. దీనిలో వారికి ఏ వేరియంట్ సోకిందో తెలియనుంది. ఒక వేళ ఎవరికైాన ఓమిక్రాన్ వేరియంట్ సోకితే మాత్రం తెలంగాణలో డేంజర్స్ బెల్స్ మోగినట్లే అని అంత అంటున్నారు.