24 దేశాల విమాన సర్వీసులను సస్పెండ్ చేసిన ఒమన్!

మస్కట్: మహమ్మారి కరోనా నేపథ్యంలో గల్ఫ్ దేశం ఒమన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా 24 దేశాల విమాన సర్వీసులను సస్పెండ్ చేసింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని సంబంధిత అధికారులు తెలిపారు. అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఒమన్ ఈ విషయాన్ని గురువారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ఒమన్ విమాన సర్వీసులు క్యాన్సిల్ చేసిన దేశాల జాబితాలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, యూకే, ట్యునీషియా, లెబనాన్, బ్రూనై, ఇండోనేషియా, ఇథియోపియా, ఇరాన్, అర్జెంటీనా, బ్రెజిల్, సుడాన్, ఇరాక్, ఫిలిప్పీన్స్, టాంజానియా, దక్షిణాఫ్రికా, సింగపూర్, ఘనా, సియెర్రా లియోన్, గినియా, కొలంబియా, నైజీరియా, లిబియా ఉన్నాయి.

తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/videos/