తెలంగాణ పోలీసుల తీరు ఫై రాజ్యసభ ఎంపీ ఓం ప్రకాష్ మాథుర్ అసహనం

తెలంగాణ పోలీసుల తీరు ఫై రాజ్యసభ ఎంపీ ఓం ప్రకాష్ మాథుర్ అసహనం వ్యక్తం చేసారు. బిజెపి జాతీయ కార్యనిర్వహణ సమావేశాల్లో భాగంగా తెలంగాణా కు వచ్చిన ఓం ప్రకాష్ మాథుర్..ఈరోజు హన్మకొండ బిజెపి ఆఫీస్ లో బిజెపి నేతలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు అగ్నిపథ్ కు వ్యతిరేకంగా బిజెపి ఆఫీస్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయడం..నేతలకు అక్కడి నుండి తరిమికొట్టే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలో.. ఎంపీ ఓం ప్రకాష్ మాథుర్ మీడియాతో మాట్లాడారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన ఆసహనం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజలను కలవడానికి జాతీయ నేతలు వచ్చారని, అందులో భాగంగా తాను బీజేపీ శ్రేణులను నిన్నటి నుండి కలుస్తున్నట్లు చెప్పారు. బీజేపీ సమావేశాలను అడ్డుకోవడానికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించారని తెలిపారు. శాంతియుత సమావేశాలను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. నిరసన పేరిట కాంగ్రెస్ శ్రేణులు దాడులకు తెగబడ్డారని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో పోలీసులను అడ్డు పెట్టుకుని టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. తాను ఎన్నో రాష్ట్రాలు తిరిగాను.. కానీ ఇలాంటి నిర్భందం ఎక్కడా చూడలేదని వెల్లడించారు.