లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఏకగ్రీవం

om birla
om birla

న్యూఢిల్లీ: 17వ లోక్‌సభ స్పీకర్‌గా బిజెపి ఎంపి ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ పదవికి బిర్లా పేరు ప్రధాని మోది ప్రతిపాదించగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, గడ్కారీ, అమిత్‌ షాతో పాటు వివిధ పార్టీల ఎంపీలు సమర్ధించారు. ప్రొటెం స్పీకర్‌ను మూజువాణి ఓటు ద్వారా ఎన్నిక ప్రక్రియ చేపట్టగా, సభ్యులు ఓం బిర్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఓం బిర్లాను ప్రధాని మోది, ప్రతిపక్ష నేత అధీర్‌ రంజన్‌ తదితరులు సభాస్థానం వరకూ తోడ్కొని వెళ్లగా బిర్లా స్పీకర్‌ స్థానంలో ఆసీనులయ్యారు. తెలుగు రాష్ట్రాల ఎంపీలు స్పీకర్‌కు అభినందనలు తెలిపారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/