నేడు ఒలింపిక్స్‌ కమిటీ సమావేశం

అన్ని క్రీడాసంఘాల నిర్ణయం

Olympics committee meeting
Olympics committee meeting

టోక్యో: ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా విస్తరించిన కరోనావైరస్‌కారణంగా వివిధ దేశాల్లో టోర్నీలు రద్దవుతుండగా టోక్యో ఒలింపిక్స్‌ను మాత్రం యధా తథంగా నిర్వహిస్తామని ఆదేశప్రధాని షింజో అబే ధీమాగాప్రకటిస్తే క్రీడా సంఘం మాత్రం ఎదురవుతున్న ఇబ్బందులు,సాధాకబాధకాలపై మంగళవా రం అన్ని క్రీడా సంఘాలతో అత్యవసర సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.

అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ ఆధ్వర్యంలోమొత్తం వివిధ దేశాల నుంచి వస్తున్న క్రీడాకారులు ఆయా దేశాల సంఘాలు సమాఖ్యలతో ఈ సమావేశం నిర్వహించి సలహాలు అభిప్రాయాలు సేకరిస్తుంది.

ఒలింపిక్స్‌కు మరొక 130 రోజులు మాత్రమే ఉంది. ఒలింపిక్స్‌లో భాగమైన క్రీడలకు సంబంధించి ప్రపంచ సమాఖ్యలు, వివిధ దేశాల జాతీయ ఒలింపిక్‌సంఘాలు, క్రీడాకారులసంఘాలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఐఒసి అధ్యక్షుడు థామస్‌ బాక్‌ వెల్లడించారు.

స్విట్జర్లాండ్‌ సాకర్‌సమాఖ్య అధ్యక్షుడు 70ఏళ్ల డొమినిక్‌బ్లాంక్‌కు కరోనా సోకింది. అయిత ప్రస్తుతం ఇంట్లోనేప్రత్యేక గదిలో ఉంటున్నాడు. ప్రస్తుతం బాగానే ఉందని, కొద్దిగా ఫ్లూలక్షణాలుమాత్రమే ఉన్నా యని డొమినిక్‌బ్లాండ్‌ అన్నాడు.

దీనితో సమాఖ్య ప్రధాన కార్యాలయం మూసేసారు. ఆతనితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు వైద్యసదుపాయాలు కల్పించారు. మార్చి 3న ఆమ్‌స్టర్‌డామ్‌లోజరిగిన యూరోపియన్‌ సాకర్‌సమాఖ్య వార్షిక సమావేశంలో డొమినిక్‌పాల్గొన్నాడు.

మరోవైపు సెర్బియా సాకర్‌సమాఖ్య అధ్యక్షుడు 42ఏళ్ల స్లవిసా కొకెజాకు కూడా కరోనా సోకింది. ఈనేపథ్యంలో సదస్సు నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఐఒసి అధ్యక్షుడు అన్ని క్రీడా సంఘాలు, అన్ని దేశాల సమాఖ్యలతోసమావేశం అవుతున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/