ప్రసిద్ధిగాంచిన ‘అనంత ‘ఓళిగలు


అనంతపురం జిల్లాలోని ఓళిగల సెంటర్‌ అంటే తెలియని వారుండరు. ఒకప్పుడు కమలానగర్‌ పాతూరుగా పిలువబడే ఈ వీధి ఇప్పుడు ఓళిగల సెంటర్‌గా ప్రసిద్ధి చెందింది. రాజకీయ నాయకులు, సినీప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఓళిగల రుచి చూడందే వెనుతిరుగరు అంటే వీటి రుచిని అర్ధం చేసుకోవచ్చు. ఆ నగరం ప్రజలతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. ములుపు తిరుగుతుండగానే ఆమడ దూరంలో నుంచి కమ్మటి వాసనలు స్వాగతం పలుకుతాయి.

OLIGALU food item in Anantapur District
OLIGALU food item in Anantapur District

జన సముహంలో కిటకిటలాడుతూ ఉండే ఆ దుకాణంలో కింద కూర్చున్న నలుగురు వ్యక్తులు ఓళిగలు చేస్తూ కనపడతారు. ఇంతేనా ఇంకా ఇక్కడ ఏదో అద్భుతం జరుగుతోంది అనుకునే వారు ఓళిగల రుచి చూసి నోట మాట రాకుండా ఉండిపోతారు. పుల్లారెడ్డి స్వీట్స్‌తో పోటీపడుతూ, కాకినాడ కాజాను మరిపిస్తూ తిరుపతి లడ్డూను గుర్తు చుస్తున్నట్టుండే అనంతపురం ఓళిగలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. సినీతారల మనసును దోచాయి ఈ ఓళిగలు. వివిధ పార్టీల నాయకులు తమ అధినాయకులకు ఈ ఓళిగలను కానుకగా ఇస్తుంటారు. ఒకప్పుడు కమలానగర్‌ పాతూర్‌, మొదటిరోడ్డుకు పరిమితమైన ఓళిగలు సెంటర్లు ఇప్పుడు వందల సంఖ్యలో జిల్లా వ్యాప్తంగా సందడి చేస్తున్నాయి. ఒక్క అనంతపురంలోనే యాభై దాకా సెంటర్లు ఇప్పుడు కిటకిటలాడుతుంటాయి. ఇరవై ఏళ్ల కిందట గోపాల్‌ అనే వ్యక్తి తాను స్వయంగా తయారుచేసిన ఓళిగలను బకెట్‌లో పెట్టుకుని ఊరంతా తిరిగి అమ్ముకోవడంతో ప్రారంభమైన ఓళిగల వ్యాపారం నేడు నగరమంతటా విస్తరించింది. వృత్తిపట్ల అంకిత భావం, ఆత్మవిశ్వాసం వారిని ఈ స్థాయికి తెచ్చాయి. వీరి వ్యాపారం ఎంతోమందికి స్పూర్తినిస్తోంది ఘమఘమలాడుతూ, పొడిపోడిగా ఉంటాయి ఈ ఓళిగలు.
పలు రకరకాల ఓళిగలు
నెయ్యి, కొబ్బరి, కోవా, పూర్ణం, డ్రైఫ్రూట్స్‌.. ఇలా రకరకాలుగా ఓళిగలను తయారుచేస్తుంటారు. నగరానికి చెందిన ప్రవాసాంధ్రులు అమెరికా వెళ్తున్నపుడు తప్పకుండా ఓళిగలను అక్కడివారికి రుచి చూపించడంతో వీరి ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. అద్దె ఇళ్లల్లో ఉంటూనే మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు వీరు. పేదరికాన్ని మరిచిపోయే మంచితనమో, ఎదిగినా ఒదిగుండాలన్న వినయయో తెలీదు కానీ, తమలాగే మరో పది మంది బాగుపడాలని ఆకాంక్షిస్తుండడం వారి విజయగాథకు సోపానం.

OLIGALU food item in Anantapur District
Oligalu food item


తయారీలోనే ప్రత్యేకత:
సాధారణంగా ఓళిగలు ఎక్కడ చేసినా దాదాపు ఒకే రుచి ఉండాలి. కానీ అనంతపురం ఓళిగలు చాలా ప్రత్యేకం. అన్నిచోట్లా మందంగా ఉండే బోబ్బట్లులాగ ఉండవు వీరి ఓళిగలు. స్వచ్ఛమైన రవ్వకు బెల్లం, గసగుసాలు, ఏలకులు, రిఫైన్డ్‌ ఆయిల్‌తో చేసి తయారయ్యే ఓళిగలు నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయి. అందువల్లే వీటికి ఇంత డిమాండ్‌. మామూలు ఓళిగ పది రూపాయలు ఉంటే, కోవా ఓళిగ 20 నుండి 30, స్పెషల్‌ ఓళిగ 20, ఢ్రై ఫ్రూట్స్‌ 40, కొబ్బరి కోవా 20 రూపాయల వరకు పలుకుతుంది. ఒక్కో నిర్వాహకుడు సగటున రెండు వందల నుండి మూడు వందల వరకు వివిధ రకాలైన ఓళిగలను విక్రయిస్తుంటారు. వ22ుంచి ఆదాయ వనరుగా ఉన్నాయి అనంత ఓళిగలు.
అందుబాటు ధర: ఓళిగ సెంటర్లకు డిమాండు ఎక్కువగా ఉంది. నేతి ఓళిగలైన మామూలు ఓళిగలైన తక్కువ ధరలో దొరుకుతుండడంతో స్వీట్సు కొనాలనుకుంటే ఓళిగలనే ఎంచుకుంటారు. ఈ కాలంలో రుచికరమైన ఏ స్వీటైనా పదిరూపాయల పై మాటే. కానీ ఇక్కడ కేవలం ఎనిమిది రూపాయలకే శుభ్రమైన ఓళిగ లభిస్తుంది కాబట్టే అంత డిమాండ్‌.
నాకు ఓళిగల రుచి కన్నా పేదరికం రుచే బాగా తెలుసు. కష్టపడి పైకి రావాలంటే రాజీపడని మనస్తత్వం ఉండాలి. నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం. ఖరీదైన బెల్లం,బేడలు, ఏలకులు, గసగసాలు వాడడం వలన మా ఓళిగలకు మంచి రుచి వస్తుంది. పండుగలప్పుడు రోజుకు ఆరు వేల వరకు ఓళిగలు తయారుచేస్తున్నా ఎక్కడా నాణ్యత లోపించదు. కస్టమర్లతో మాట్లాడే పద్దతి కూడా ఒక రకంగా మా వ్యాపారం ఈ స్థితి లో ఉండడానికి కారణమనుకుంటాను. జూనియర్‌ ఎన్టీఆర్‌ వివాహం మా అనంతపురానికి ప్రత్యేక గౌరవం తెచ్చి పెట్టింది.
కష్టాలను ధైర్యంగా అధిగమించాలి. మేం ఎదగడానికి మాకు చాలామంది చేయూతనిచ్చారు. వారిని ఎన్నటికి మరచిపోలేం. నాణ్యత తగ్గని మా ఓళిగలు మా కృషికి నిదర్శనం. ఒక నాడు పది రూపాయల కూలీకి వెళ్లిన మేము, కొందరికి పని ఇచ్చే స్థాయికి ఎదిగాం. నిరంతర శ్రమతో పైకి వచ్చాం. పెద్ద పెద్ద హోటళ్లలో ఓళిగలు మోనూలో దర్శనమివ్వడం మాకు చాలా గర్వంగా ఉంది.