వృద్ధాప్యాన్ని గౌరవించాలి

OLDAGE
OLDAGE

వృద్ధాప్యాన్ని గౌరవించాలి

మనదేశంలో 60 ఏళ్లకు మించిన వృద్ధులు దాదాపు 12 కోట్ల మంది ఉన్నట్టు 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి. మరో 20 ఏళ్లలో ఈ సంఖ్య రెట్టింపు కాగలదని అంచనా. అనగా మనిషి జీవన పరిమాణం పెరుగుతుంది. ఇది మంచి పరి ణామమే. 1984లో ‘వియన్నాలో మొట్టమొదటిసారిగా వృద్ధుల కోసం అంతర్జాతీయ సదస్సు జరిగింది. అక్కడే సీనియర్‌ సిటిజన్‌ ఐక్యరాజ్య సమితి చొరవతో వృద్ధుల కోసం ఒక ప్రణా ళికను రూపొందించి ప్రపంచ దేశాలన్నీ తప్పనిసరిగా అమలు చేయాలని కోరింది. 1999 సంవత్సరంలో మనదేశంలో వృద్ధు ల సంక్షేమానికి ఒక జాతీయ ప్రణాళికను ఏర్పాటు చేశారు. ఆర్థిక భద్రత, ఆరోగ్యరక్షణ, నివాస వసతి, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికను రూపొందించారు. అయితే అది ఏ కార్యాచరణకు నోచుకోలేదు. 2004లో స్పెయిన్‌ దేశంలో జరిగిన 86 దేశాల సమీక్షా సమావేశాలలో వృద్ధుల సంక్షేమం కోసం 46 తీర్మానాలను ఆమోదించింది. ఫలితంగా మన కేంద్ర ప్రభుత్వం 2007లో వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టాన్ని తీసు కొచ్చింది. రాష్ట్రాలన్నీ ఆ నియమ నిబంధనలను రూపొందించు కొని ఆ చట్టాన్ని అమలు చేయమని కోరింది.

రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు కోటి మందికిపైగా 60 సంవత్సరాలకు పైబడిన వృద్ధులు ఉన్నట్లు అంచనా. ఇందులో 25 శాతం మంది రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్‌, ప్రైవేట్‌ సెక్టార్లలో ఉద్యోగ విరమణ చేసి, పెద్దమొత్తంలో పి.ఎఫ్‌, ఇ.పి.ఎఫ్‌, డబ్బు పొంది నెలనెలా పెన్షన్లు పొందుతూ సొంత ఇండ్లలో హాయిగా బతుకుతున్నారు. మరో 15 శాతం మంది సొంత ఇండ్లతో, నెలనెలా అద్దెలతో వ్యవసాయ భూముల వలన పంటల ఆదాయంతో ఉన్నారు. వీరి విషయంలో ఏ బాధా లేదు. ఇంకో 15 శాతం 60 ఏళ్లు పైబడినా కూడా వివిధ రకాల వ్యాపారాలు, వర్తకాలు చేస్తూ డబ్బు సంపాదించు కొంటున్నారు.

మరో 10 శాతం మంది కుమారల సంరక్షణలో ఉన్నారు. వారికి కూడా ఏ దిగులూ లేదు. మిగిలిన 35 శాతం మంది గురించే మనం ఆలోచించాలి. ఇందులో 25 లక్షల మంది గ్రామాల్లో జీవిస్తున్నవారే. ఈ 25 లక్షల మంది ఆర్థిక, సామాజిక, అనారోగ్య బాధలుపడుతున్నారు. దినసరి కూలీలు, వ్యవసాయ కూలీఉల, చేతివృత్తుల వారు 60 సంవత్సరాల తర్వాత శరీర సత్తువ తగ్గి సంపాదించుకోలేకపోతున్నారు. వీళ్లకు మరే విధమైన ఆర్థిక వనరులు లేకపోవడం వలన ఆకలితో అల మటిస్తున్నారు. ఎంతో కష్టపడి కాయకష్టం చేసి రెక్కలు ముక్క లు చేసుకొని పైసా పైసా కూడబెట్టి తమలాగా తమ పిల్లలు కష్టపడకూడదని ముందు చూపుతో పిల్లలకు చదువ్ఞ చెప్పించి ప్రయోజకుల్ని చేస్తే వాళ్ల చేతనే ఈ వృద్ధులు నిరాదరణకు గురవ్ఞతున్నారు. దీనికంటే ఘోరం మరొకటి ఉంటుందా? ఉద్యోగరీత్యా మరో ప్రాంతాలలో ఇతర దేశాలలో స్థిరపడి తమ తమ తల్లిదండ్రులను ఆదుకోనివారు ఎంతో మంది ఉన్నారు. వాళ్లు సంపాదించుకోవడం, భార్యాపిల్లలను పోషించుకోవడంలో ఉన్న శ్రద్ధ తల్లిదండ్రులపై ఉండటం లేదు. సాధారణంగా 60 ఏళ్ల పైబడిన వాళ్లకు రోగాలు మొదలవ్ఞతుంటాయి.

దీర్ఘకాల రోగాల బారిన పడి ఖరీదైన వైద్యం చేయించలేక ఎంతో మంది శేషజీవితాన్ని దుర్భరంగా గడుపుతున్నారు. ఇక మా బతుకు లింతే అని నిరాశానిస్పృహలతో భారంగా గడుపుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు ప్రతి మండల కేంద్రంలో ఈ వృద్ధులకు ఉచిత వైద్య సహకారం అందించాలి. 2003లో రాష్ట్ర ప్రభు త్వాలు విడుదల చేసిన కార్యాచరణ పథకం బస్సుల్లో సీనియర్‌ సిటిజన్లకు ఛార్జీలు రాయితీ ఇస్తామని ప్రకటించి మహారాష్ట్రలో 75 శాతం, రాజస్థాన్‌ 25 శాతం, పంజాబ్‌, ఢిల్లీ, ఛండీగఢ్‌, గోవాలలో 50 శాతం, కర్ణాటకలో 25 శాతం, తమిళనాడు, కేరళలో 30 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 20 శాతం రాయితీ ఇస్తున్నారు. పై రాష్ట్రాలను చూసైనా తెలంగాణ రాష్ట్రంలో కనీ సం 30 శాతం బస్సుల్లో రాయితీ ఇవ్వాలి. ఒక్క జి.హెచ్‌. ఎం.సి హైదరాబాద్‌ పరిధిలో ఆసరా కార్డులు ప్రవేశపెట్టడం కొంత వరకు సంతోషమే. జి.హెచ్‌.ఎం.సిలో 300 సంఘాలు, సుమారు ఒక లక్ష యాభైవేల మంది సభ్యులతో ఉన్నాయి.

ఇందులో సుమారు లక్ష మంది ఆసరా కార్డులు పొందారు. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఇటువంటి ఆసరా కార్డులు పొందే ఏర్పాట్లు చేయాలి. ఈ ఆసరా కార్డుల వలన ప్రయోజనాలు ఉండాలి. ఆర్టీసి బస్సులలో రాయితీ, రైల్వేలలో ఇస్తున్న 40 శాతం కాకుండా ఇంకో 20 శాతం పెంచాలి. అంతేకాకుండా రిజర్వేషన్‌లో కూడా ప్రాముఖ్యం కల్పించాలి. ప్రతి బ్యాంకులో ‘క్యూతో నిమిత్తం లేకుండా సీనియర్‌ సిటిజన్లకు లావాదేవీలు జరిపే సదుపాయాలు కల్పించాలి. కార్పొరేట్‌ ఆస్పత్రులలో 25 శాతం రాయితీ కల్పించి ఆ విషయాన్ని ఆస్పత్రి బోర్డులపై ప్రదర్శించాలి. రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి ఒక మంత్రిని నియమించాలి.

సీనియర్‌ సిటిజన్లు ఎదుర్కొంటున్న సామాజిక బాధలు పరిష్కరించడానికి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలి. అనారోగ్యంతో బాధ పడే వృద్ధులకు ఉచిత వైద్యసహాయం అందచేయాలి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పోలీసు స్టేషన్‌లో వృద్ధులను గౌరవిం చడం మన బాధ్యత అనే బోర్డులను ఏర్పాటు చేయాలి. మన తెలుగు రాష్ట్రాలు ఏర్పడ తర్వాత ఇద్దరుముఖ్యమమత్రులు ఎన్ని కల ముందు ప్రకటించిన హామీల ప్రకారం వృద్ధులకు వెయ్యి రూపాయల పెన్షన్‌ మంజూరు చేస్తున్నారు. ఈ విషయంలో వృద్ధులు కొంతవరకు సంతోషపడాలి. శ్రీశైలం, యాదగిరిగుట్ట మొదలగు రద్దీ ఉండే పుణ్యక్షేత్రాలలో వృద్ధులకు క్యూ నిమిత్తం లేకుండా తిరుపతిలో లాగా డైరెక్టుగా దర్శన ఏర్పాట్లు కల్పించా లి. అందుకే సీనియర్‌ సిటిజన్లందరూ సంఘాలలో సభ్యులై ‘మన కోసం మనమే అనే సిద్ధాంతంతో శేష జీవితాన్ని సుఖ మయం చేసుకోవాలి.

-మునిగంటి శతృఘ్నచారి
(రచయిత: సెక్రటరీ, సీనియర్‌ సిటిజన్స్‌ తెలంగాణ రాష్ట్రం)