నాలుగేళ్లలో ఓలా ఐపిఒ!

OLA
OLA

నాలుగేళ్లలో ఓలా ఐపిఒ!

బెంగళూరు: మొబైల్‌ యాప్‌ సాయంతో దేశంలోని ప్రధాననగరాల్లో ట్యాక్సీసేవలందిస్తున్న ఓలా వచ్చే నాలుగేళ్లలోనే ఐపిఒకు వస్తోంది. ఇన్వెస్టర్లనుంచి నిధులు సమీకరణ రానురాను కంపెనీ లాభాల్లోకి వస్తుండటంతో ఇకపై తగ్గుతుందని సిఇఒ భవిష్‌ అగర్వాల్‌ వెల్లడించారు. అంతేకాకుండా ఐపిఒజారీచేయడంద్వారా కంపెనీ సొంతంగానేనిధులు సమీకరిస్తుందని తద్వారా దేశవ్యాప్తంగామరింత విస్తరిస్తుందని చెపుతున్నారు. తన ప్రధానపోటీదారు ఉబేర్‌తోమరింత పోటీపడేందుకువీలుగా భారత్‌లోని సంస్థను ముందు లాభాల్లోనికి తీసుకువస్తోంది. సంస్థ సహ వ్యవస్థాపకుడు సిఇఒ భవిష్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ లాభాల్లోనికి వచ్చిందని, సత్వరమేనగదు నిల్వలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రతి రైడ్‌లోను ఓలా నగదు ఆర్జిస్తోందన్నారు. సంస్థ లాభాల్లోకి వస్తే ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు తగ్గుతాయని కంపెనీ సొంతంగానే నిధులు సమీకరించుకోగలదని చెపుతున్నారు. లాభాల్లోకి వచ్చిన వెంటనే ఐపిఒకు రాలేమని, నాలుగేళ్ల కాం పడుతుందని చెపుతున్నారు.