క్యాబ్‌ డ్రైవర్లకు గుడ్‌న్యూస్‌

ola, uber cabs
ola, uber cabs

బెంగళూర్‌: ప్రయాణీకుల నుంచి వసూలు చేసిన మొత్తంలో కమీషన్‌ రూపంలో ఓలా, ఊబర్‌ అధికంగా గుంజేస్తున్నాయని క్యాబ్‌ డ్రైవర్లు ఆందోళన చెందుతన్న క్రమంలో వారికి ఊరట ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఒక్కో రైడ్‌కు క్యాబ్‌ ఆపరేటర్లు ప్రస్తుతం 20 శాతం కమీషన్‌ వసూలు చేస్తుండగా దాన్ని 10 శాతానికి తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. ఆయా సంస్థలు వసూలు చేస్తున్న కమీషన్‌ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించడం ఇదే తొలిసారి. మరోవైపు క్యాబ్‌ ఆపరేటర్ల రాబడిపై రాష్ట్ర ప్రభుత్వాలు సైతం లెవీని విధించవచ్చని కేంద్రం మార్గదర్శకాలను రూపొందించింది. ఓలా, ఊబర్‌లపై నూతన మార్గదర్శకాలపై ప్రజాభిప్రాయాన్ని స్వీకరించేందుకు రానున్న వారంలో ముసాయిదాను విడుదల చేస్తామని, హైవే మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/