‘ఓలా’ క్యాబ్‌లు ఆరు నెలలు నిషేధం

Ola Cab
Ola Cab

బెంగళూరు: క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ ‘ఓలా’ కు కర్ణాటకలో షాక్‌ తగిలింది. ఆరాష్ట్ర రవాణాశాఖ ఆరు నెలల పాటు ఓలా ట్యాక్సీలు, ఆటోలపై నిషేదం విధించింది. అనుమతి లేకుండా బైక్‌ ట్యాక్సీలను నడుపుతున్నందుకు గానూ రవాణాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలను నడపం నిషేధం. అయితే నిబంధనలను ఉల్లంఘిస్తూ గత జనవరి నుంచి ఓలా బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో బైక్‌ ట్యాక్సీలను నిర్వహిస్తోంది. దీంతో రవాణాశాఖ ఓలాకు గతంలో షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. వీటికి స్పందించిన సంస్థ.. ప్రజల నుంచి సమాచారం సేకరించేందుకు బీటా పైలట్‌ ప్రాజెక్టు కింద ఈ ట్యాక్సీలను నడుపుతున్నామని తెలిపింది. అయితే సంస్థ ఇచ్చిన వివరణ అసంపూర్ణంగా ఉండటంతో ఓలాపై రవాణాశాఖ చర్యలు చేపట్టింది. ఆరు నెలల పాటు ఓలా లైసెన్సును సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపింది. కంపెనీ ట్యాక్సీలు, ఆటోలు నడపకుండా నిషేధం విధించింది.


మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/