మళ్లీ పెరిగిన చమురు, పెట్రోల్‌ ధరలు

డాలర్‌ డౌన్‌, బలపడిన రూపాయి

Rising oil and petrol prices again
Rising oil and petrol prices again

న్యూఢిల్లీ: డాలర్‌ మారకంతో రూపాయి శుక్రవారం బలపడింది. ప్రారంభ ట్రేడింగ్‌లో 11 పైసలు లాభపడి 74.91వద్ద ట్రేడవుతోంది.

చివరికి రూపాయి 18 పైసలు పెరిగి రూ.74.84వద్ద స్థిరపడింది.

అమెరికా డాలర్‌ మారకంతో రూపాయి 74.70నుంచి 75.20 మధ్య క్లోజ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఫోరెక్స్‌ ట్రేడ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

దేశీయ కరెన్సీ గురువారం బలహీనపడిన విషయం విదితమే.

శుక్రవారం బలపడింది. అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉన్నట్లు డేటా వెల్లడించడంతో డాలర్‌ క్షీణించింది. చమురు ధరలు శుక్రవారం పెరిగాయి. వరుసగా మూడో రోజు పెరుగుదలను నమోదు చేశాయి.

కరోనా మహమ్మారి నుంచి ప్రపంచార్థిక వ్యవస్థలు కాస్త కోలుకున్న సంకేతాలు కనిపిస్తుండడంతో చమురు ధరలు పెరుగుతున్నాయి.

యుఎస్‌ వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ 0.3శాతం పెరిగి బ్యారెల్‌ 42.95డాలర్లు, బ్రెంట్‌ క్రూడాయిల్‌ ప్యూచర్స్‌ 0.4శాతం పెరిగి బ్యారెల్‌ 45.07డాలర్లు పలికింది.

దీనికి అనుగుణంగా దేశంలో కూడా పెట్రోల్‌ ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి.

పెట్రోల్‌ ధర శుక్రవారం లీటరుకు హైదరాబాద్‌లో 20పైసలు పెరిగి రూ.84.38కి చేరింది.

డీజిల్‌ధర రూ.80.17వద్ద కొనసాగింది. అమరావతిలో లీటరుపెట్రోల్‌ ధర రూ.19పైసలు పెరిగి రూ.85.97కు చేరింది. డీజిల్‌ ధర రూ.81.32గా ఉంది.

విజయవాడలో లీటరు పెట్రోల్‌ ధర రూ.19పైసలు పెరిగి రూ.85.53కు చేరగా, డీజిల్‌ ధర రూ.80.901కు చేరింది.

ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.19పైసలు పెరిగి రూ.81.19కి చేరగా డీజిల్‌ ధర రూ.73.56వద్ద ఉంది.

ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.19పైసలు పెరిగి రూ.87.87కు చేరింది. డీజిల్‌ ధర రూ.80.11వద్ద నిలకడగా ఉంది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/