నేడు తెరుచుకోనున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు

Babli project
Babli project

ముంబయి: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఈరోజు తెరుచుకోనున్నాయి. నేటి నుండి అక్టోబరు 29 వరకు అధికారులు బాబ్లీ గేట్లు తెరిచి ఉంచనున్నారు. అయితే కేంద్ర జలసంఘం, తెలంగాణ, మహారాష్ట్ర అధికారుల సమక్షంలో అధికారులు గేట్లు తెరవనున్నారు. బాబ్లీ ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం ద్వారా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలలోని ఆయుకట్టుకు సాగునీరు అందుతుంది. కాగా బాబ్లీ ప్రాజెక్టులో నీళ్లు లేక గేట్లు తెరిచినా దిగువకు రాని నీటి ప్రవాహం.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఏటా అధికారులు గేట్లు తెరుస్తున్నారు.


తాజా మొగ్గ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/kids/