3 వారాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభం – మంత్రి నారాయణ

ఏపీలో అన్న క్యాంటీన్ల ప్రారంభానికి కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈరోజు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ వీటి ఏర్పాటుపై సమీక్షించారు. ‘3 వారాల్లో 100 క్యాంటీన్లు తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వీటి నిర్వహణ మళ్లీ ఇస్కాన్కు ఇవ్వాలా? టెండర్లు పిలవాలా? అనే దానిపై అధ్యయనం చేస్తున్నాం అన్నారు.

ఎందరో పేదవాళ్ల కడుపు నింపిన అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభ పనులు చకాచకా సాగుతున్నాయి. టిడిపి హయాంలో నెలకొల్పిన క్యాంటీన్లులో కొన్ని పాడవగా మరికొన్ని చోట్ల వేర్వేరు ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కార్యకలపాలు సాగుతున్నాయి. సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు ఆయన సంతకం చేశారు. చంద్రబాబు ఆదేశాలతో వీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం చేసే నిర్ణయం తీసుకున్న చంద్రబాబుపై ప్రజల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

గతంలో 184 వరకు అన్న క్యాంటీన్లు ఉండేవి. మరో 19 క్యాంటీన్లకు సంబంధించి షెడ్‌ పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇప్పుడు వాటిని పూర్తిచేసి మొత్తం 203 క్యాంటీన్లను సెప్టెంబర్‌ 21లోగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.