అనువైన మార్గంలో …

OFFICE WORK
OFFICE WORK

అనువైన మార్గంలో …

కొందరు ఉద్యోగులు మాటిమాటికీ కోపం, అసహనానికి గురవ్ఞతుంటారు. ఫలితంగా వారు మానసికంగా కుంగిపోవడం పనిలో నాణ్యత లోపిస్తుంటుంది. దీనికి గల కారణాలను ఇటీవల అమెరికా మానసిక శాస్త్రవేత్తలు విశ్లేషించారు. అందుకు దోహదం చేసే వాటిని వెల్లడించారు. ఆఫీసుల్లో ఉద్యోగులకు అసౌకర్యం కల్పించే అంశాలమీద దృష్టి పెట్టి అధ్యయనం ఆరంభించిన శాస్త్రవేత్తలు ఆ దిశలో ఎందరో ఉద్యోగులతో మాట్లాడారు. వివిధ సందర్భాల్లో వారి స్పందనలను అడిగి తెలుసుకున్నారు. ఆసక్తి గొలిపే ఆ వివరాలిలా ఉన్నాయి. ్య కార్యాలయాల్లో భిన్న మనస్తత్వాలున్న వ్యక్తులతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. వారి ప్రవర్తన, మాటలు, వ్యవహారశైలి ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పెడుతుంటుంది. కొందరు సహోద్యోగులు ఎప్పుడూ పక్కవాళ్లమీద చిరుబురులాడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల మాటలు మిగతా వారి మీద ప్రభావం చూపుతాయి. దాంతో చురుకుదనం తగ్గిపోయి అసహనం ఆవహిస్తుంది అని ముఫ్లయి ఏడు శాతం ఉద్యోగులు తెలిపారు. డెడ్‌లైన్‌ దగ్గరపడుతోంది. పనింకా పూర్తికాలేదు. సరిగ్గా ఆ సమయంలోనే కంప్యూటర్‌లో సాంకేతిక లోపాలు. దాంతో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి. వాటన్నింటినీ అధిగమించడం కత్తిమీద సాము అవుతోంది.

ఆటవిడు పుగా, అసూయతో సహోద్యోగులు చేసే వ్యాఖ్యలు ఆత్మన్యూనతకు కారణం అవ్ఞతు న్నాయని చెప్పారు పందొమ్మిది శాతం ఉద్యో గులు. ఇవేకాదు కొన్నిసార్లు ఆఫీసు పరిస రాలు, ఆహార నియమాలు, గట్టిగా ఫోన్‌ మాట్లాడే వ్యక్తులు, మరుగుదొడ్ల అపరిశుభ్రత వంటివన్నీ ఉద్యోగులకు అసౌ కర్యం కలిగిం చేవే. అయితే ఇవన్నీ ఒక్కసారే ప్రభావం చూపించకపోవచ్చు కానీ ఎంతో కొంత అసంతృప్తికి గురిచేస్తాయని మానసిక నిపు ణులు వెల్లడించారు. అయితే ఉద్యోగమన్నా క కచ్చితంగా కొన్ని నచ్చని పరిస్థితులుంటా యి. వాటిని గమనించి వాటి ప్రభావం పడకుండా సాగిపోవడానికి అనువైన మార్గా లను అన్వేషించాలని సూచించారు.