సిజెఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకే

సుప్రీంకోర్టు మరో కీలక తీర్పు

Supreme Court of India
Supreme Court of India

ఢిల్లీ: సుప్రీంకోర్టు సిజెఐ జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలో మరో కీలక తీర్పును వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ) కార్యాలయం సమాచార హక్కు చట్టం(ఆర్‌టిఐ) పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. కాగా సిజెఐ కార్యాలయం ఆర్‌టిఐ పరిధిలోకి వస్తుందని 2010జనవరిలోనే ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు దానిని సమర్థించింది. కాగా ఈ మేరకు ధర్మాసనంలోని మెజార్టీ న్యాయమూర్తులు హైకోర్టు తీర్పును సమర్థించడం గమనార్హం. అయితే న్యాయవ్యవస్థపై పరిశీలనకు ఆర్టీఐ ఒక సాధనంగా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. పారదర్శకత అనేది న్యాయస్వేచ్ఛకు భంగం కాదని ప్రకటించింది. సమాచార హక్కు, గోప్యత హక్కు అనేవి కలిసిమెలిసి ఉండాలని కోర్టు తన అభిప్రాయాన్ని తెలిపింది. అయితే ఆర్టీఐని నిఘా అస్త్రంగా వినియోగింకూడదని, న్యాయవ్యవస్థ స్వతంత్రను దృష్టిలో ఉంచుకొని ఆ చట్టాన్ని వినియోగించాలని సుప్రీం సూచించింది. అంతేకాకుండా కొలీజియం ప్రతిపాదించిన న్యాయమూర్తుల పేర్లను మాత్రమే ఆర్‌టిఐ కింద ఇవ్వడం జరుగుతుందని తేల్చి చెప్పింది. దానికి గల కారణాలను మాత్రం వెల్లడించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/