జల్లెడ పడుతున్న అధికారులు

మత ప్రార్దనలకు వెళ్లి వచ్చిన వారి కోసం గాలిస్తున్న పోలీసులు

police
police

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా మహామ్మారి వేగంగా విస్తరిస్తుంది.హైదరాబాద్‌లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతండడం ఇందుకు నిదర్శనం, కాగా ఢిల్లీలో జరిగిన మత ప్రార్దనలు వెలుగులోకి వచ్చాక ఈ కేసులు మరింత ఎక్కువకావడంతో, గత కొద్ది రోజులుగా ఈ ప్రార్దనలకు వెళ్లి వచ్చిన వారిని వెతికే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. దీంతో సుమారు వెయ్యి మంది వరకు అదికారులు గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించారు. అయినప్పటికి ఇంకా రాష్ట్రంలొ కేసులు పెరుగుతుండడంతో అధికారులు పాజిటివ్‌ కేసులు నమోదయిన ప్రాంతాలలో మరింతగా జల్లెడ పడుతున్నారు. చుట్టు ప్రక్కన ఉన్న ఇళ్లల్లో ఎవరైనా డిల్లీ మత ప్రార్దనలు వెళ్లారేమో అని ఆరాతీస్తున్నారు. అనుమానితులను వెంటనే క్వాంరంటైన్‌కు తరలిస్తున్నారు. అలాగే పాజిటివ్‌ కేసులు నమోదు అయిన ప్రాంతాలలో కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/