రాజస్థాన్‌లో భానుడి భగభగలు

ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న 15 నగరాల్లో 10 మనవే..2016 తరువాత 50 డిగ్రీల వేడిమి నమోదు

heatwave summers

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండ‌లు మండుతున్నాయి. గడచిన 24 గంటల్లో ప్రపంచంలోనే అత్యధికంగా వేడిమి నమోదైన ప్రాంతాల్లో 10 ప్రాంతాలు ఇండియాలోనే ఉన్నాయి. వెదర్ మానిటరింగ్ వెబ్ సైట్ ‘ఎల్ డొరాడో’ వెల్లడించిన వివరాల ప్రకారం, రాజస్థాన్ రాజధాని జైపూర్ కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చురులో మంగళవారం నాడు 50 సెల్సియస్ డిగ్రీల వేడిమి నమోదైంది. చురుతో పాటు రాజస్థాన్ లోని బికనీర్, గంగా నగర్, పిలని పట్టణాల్లోనూ, ఉత్తర ప్రదేశ్ లోని బందా, హిస్సార్, మహారాష్ట్ర, హర్యానాలోనూ గరిష్ఠ వేడిమి నమోదైంది. కాగా న్యూఢిల్లీలో 47.6 డిగ్రీలు, బికనీర్ లో 47.4, గంగానగర్ లో 47, ఝాన్సీలో 47, పిలనిలో 46.9, నాగపూర్ లో 46.8, అకోలాలో 46.5 సెల్సియస్ డిగ్రీల వేడిమి నమోదైందని అధికారులు వెల్లడించారు. 2016, మే 19న 50.2 డిగ్రీలుగా నమోదైన చురు ఉష్ణోగ్రత, తిరిగి అదే స్థాయికి చేరడం ఇదే తొలిసారని స్థానిక వాతావరణ అధికారులు వెల్లడించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/