ఏపి ఆర్టీజీఎస్కు ఒడిశా ప్రభుత్వం కృతజ్ఞతలు

అమరావతి: ‘ఫణి’ తుపాను గమనంపై ఎప్పటికపుడు సరైన సమాచారం అందించిన ఏపి ఆర్టీజీఎస్కు ఒడిశా ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపంది. అయితే ఆర్టీజీఎస్ సమాచారం సహాయక చర్యలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని పేర్కొంది. తుపానుపై ఆర్టీజీఎస్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఒడిశా ప్రభుత్వని తెలుపుతు ఏపి ప్రభుత్వం అప్రమత్తం చేసింది. తుఫాను సందర్భంగా ఆర్టీజీఎస్ సిబ్బంది 24 గంటలూ పనిచేశారు. స్టేట్ కమాండ్ సెంటర్లో సీఈవో అహ్మద్ బాబు మకాంవేసి పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ప్రజలకు నిరంతర సమాచారంపై అందించడంపై ఆర్టీజీఎస్ను సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ప్రశంసించారు. సీఈవో అహ్మద్ బాబు, సిబ్బందిని ఆయన అభినందించారు. మరోవైపు ఏపి సిఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ అంచనాలు బాగా పనిచేశాయనిట్విటర్లో పేర్కొన్నారు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/