నేటి నుండి ఒడిశా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

డిప్యూటీ స్పీకర్, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా

monsoon-session-of-odisha-legislative-assembly-to-begin-from-today

ఒడిశా: ఈరోజు నుండి ఒడిశా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పాత్రికేయులకు ప్రత్యేకంగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. మరికొందరి ఫలితాలు నేడు రానున్నాయి. తనకు కరోనా సోకిందని, ప్రస్తుతం భువనేశ్వర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరినట్టు డిప్యూటీ స్పీకర్ వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మరోవైపు, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రమీల మల్లిక్ ఆదివారం కరోనా బారినపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 మంది మంత్రులు సహా 50 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. వీరిలో పలువురి క్వారంటైన్ సమయం ఇప్పటికే ముగిసింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/