జర్నలిస్టుల కోసం ఒడిశా సిఎం కీలక నిర్ణయం

కరోనా సోకి మరణిస్తే రూ.15 లక్షలు అందజేస్తామని వెల్లడి

naveen patnaik
naveen patnaik

భువనేశ్వర్‌: కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమ రాష్ట్రంలో కరోనా సోకి మృతిచెందే జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 15 లక్షల ఆర్ధిక సాయం ఇస్తామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తెలిపారు. కరోనా వ్యాప్తి పై ప్రజలలోపూర్తి అవగాహన కల్పించడానికి మీడియా ఎంతగానో కృషి చేస్తుంది. పాత్రికేయులు వార్తల సేకరణకు వెళ్లే సమయంలో కరోనా బారిన పడుతున్నారు. కరోనా బారిన పడి మృతి చెందే పాత్రికేయులకు 15 లక్షల రూపాయలు అందిస్తామని సిఎం తెలిపారు. కాగా ఇప్పటికే పలు రాష్ట్రాలలో కొంతమంది జర్నలిస్టులు కరోనా బారిన పడడంతో వారికి సహయంగా పలు ప్రభుత్వాలు చేయుత నిస్తున్నాయి. గతంలో హర్యానా ప్రభుత్వం జర్నలిస్టులకు బీమా సౌకర్యం కూడా కల్పించింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/