అక్టోబరులో ఎనిమిదిరోజులు బ్యాంకులకు సెలవులా!

banks
banks


న్యూఢిల్లీ: బ్యాంకులకు అక్టోబునెలలో ఎక్కువ పనిదినాలు సెలవులుగా ఉన్నాయి. సుమారు ఎనిమిదిరోజులు అక్టోబరులో బ్యాంకు ఉద్యోగులకు సెలవులు లభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులే ఈ ఎనిమిదిరోజులు అని బ్యాంకు ఉద్యోగులు చెపుతున్నారు. గాంధీ జయంతి నుంచి చూస్తే అక్టోబరులో ఎనిమిదిరోజులు సెలవులు వచ్చాయి. దసరాతోపాటు సెలవులు, ఆదివారాలు కూడా ఉన్నాయి. బ్యాంకులు అక్టోబరు రెండు సహజంగానే గాంధీ జయంతి సందర్భంగా సెలవు వచ్చింది. ఇక ఆరవ తేదీ ఆదివారం సలవు అయితే ఎనిమిదవ తేదీ దసరా సందర్భంగా సెలవు వచ్చింది. 12వ తేదీ రెండోశనివారం, తర్వాత ఆదివారం సెలవులు. ఈనెల 13వ తేదీ తిరిగి 20వ తేదీ ఆదివారాలు వచ్చాయి. ఈనెల 26వ తేదీ నాలుగోశనివారం దీపావళి అక్టోబరు 27వ తేదీ వస్తోంది. ఆ రోఎజు కూడా ఆదివారం కావడంతో బ్యాంకు శాఖలు అన్నీ మూతపడతాయి. రాస్ట్రాలవారీగాచూస్తే బ్యాంకు శెలవులు వేరుగా ఉన్నాయి. ఐదురోజులపాటు దుర్గాపూజ సందర్భంగా భారతీయ స్టేట్‌బ్యాంకుశాఖలు ఈనెల ఐదునుంచి ఎనిమిదవ తేదీవరకూ బెంగాల్‌లో మూతపడతాయి. తమిళనాడులో ఎస్‌బిఐశాఖలు ఈనెల ఏడవ తేదీ ఆయుధపూజకోసం మూసివేస్తారు. కొన్ని బ్యాంకులు ఈనెల 28వ తేదీ 29వ తేదీ కూడా దీపావళి, భైదూజ్‌సందర్భంగా మూతపడనున్నట్లు తెలుస్తోంది.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/