ప్రగతిబాటలో ఎన్నో అవరోధాలు

73వ స్వాతంత్య్ర వేడుకల తరుణం ఇది

moment of the 73rd Independence Day celebrations
moment of the 73rd Independence Day celebrations

డెబ్భై మూడవ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నవేళ ఈ సుదీర్ఘ యాత్రాకాలంలో భారతదేశం సాధించిన ప్రగతి, చవిచూసిన ఎత్తుపల్లాలపై ప్రతి భారతీయుని కర్తవ్యం.

ఆంగ్లేయుల దోపిడీ పాలన వల్ల పీల్చిపిప్పి చేయబడిన భారతదేశం గత ఏడు దశాబ్దాలలో గణనీయమైన ప్రగతి సాధించింది.

నేడు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే కాక ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత శరవేగంగా వృద్ధి చెందుతూ ప్రపంచ ఆర్థికవృద్ధికి ప్రధాన ఇంజన్‌గా భారత్‌ నిలుస్తోంది.

1.35 బిలియన్‌ జనాభాలో 3.202 ట్రిలియన్‌ డాలర్ల జిడిపితో ఉన్న ఇండియా సగటున 7.4 శాతం వృద్ధి రేటును సాధిస్తూ వచ్చింది.

మనదేశం నేడు అనేక రంగాలలో స్వావలంబన సాధించి, ప్రపంచ దేశాలకు వస్తుసేవలను ఎగు మతి చేస్తుంది.

వ్యవసాయ,తయారీ, సేవారంగాలలో తిరుగులేని శక్తిగా మనదేశం అవతరించింది. కొన్ని గణాంకాలను గమనిస్తే మనకీ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది.

వ్యవసాయ ఉత్పత్తులైన తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, అల్లం, అరటి, మామిడి, జామ, నిమ్మ, పాలు,మిర్చి, జనుము, చెక్క ఇంధనం ఉత్పత్తిలో మనదేశం ప్రపంచంలో ప్రథమస్థానంలో ఉంది.

అదేవిధంగా బియ్యం, గోధుమలు, కాయధాన్యాలు, ఉల్లిపాయ, క్యాబేజీ,కాలిఫ్లవర్‌,బ్రొకొలీ, వంకాయ,గుమ్మడి, పొట్లకాయ,చెరకు, బొప్పాయి,టమాట, టీ, మేకమాంసం, పత్తి,పట్టు, జీడిపప్పు, శనగల ఉత్పత్తిలో మనదేశం ప్రపంచంలో రెండవస్థానంలో ఉంది.

చిక్కుల్లు,ఆరెంజ్‌లు, గుడ్ల ఉత్పత్తిలో మనస్థానం మూడు. ఈ వివరాలు వ్యవసాయరంగంలో భారత్‌ సత్తాను ప్రస్ఫుటం చేస్తున్నాయి.

ఇవేకాక ప్రపంచ తయారీ రంగ ఉత్పత్తి లో మూడు శాతం మనదేశమే ఉత్పత్తి చేస్తూ బలమైన పారిశ్రా మిక శక్తిగా ఎదిగింది.

ప్రపంచ సైనికశక్తిలో నాలుగోవస్థానంలోనూ, ప్రపంచ ఎగుమతులలో 13వస్థానంలో మనదేశం ఉంది. ప్రపంచ ఉక్కు ఎగుమతులలో రెండవస్థానంలోఉంది.

అపారమై న శక్తివనరులు, ఖనిజ నిల్వలు,చక్కని క్రమం తప్పని రుతు పవన వ్యవస్థ యువకార్మికశక్తి, జీవనదులు, కుటుంబ విలువలు భారతదేశాన్ని సుసంపన్న దేశంగా నిలబెడుతున్నాయి.

అనేక సూచికలను పరిశీలిస్తే అభివృద్ధిరాహిత్యం కన్పిస్తుంది. యుఎన్‌డిపి మానవా భివృద్ధి సూచిక 2019లో మనదేశ స్థానం129. విద్య, సగటు జీవన ప్రమాణాలలో మన వెనుకబాటుతనాన్ని ఇది తెలుపుతుంది.

సులభతర వాణిజ్యంలో మన ర్యాంకు 63. లంచాలు అడ్డం కులవల్ల వ్యాపారాన్ని సులభంగా ప్రారంభించలేక పెట్టుబడీదారు లు పొరుగుదేశాలకు వెళ్లుతున్నారు.

మంచి ఉన్నత విద్య, శిక్షణ, నాణ్యత, తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడంవల్ల ప్రపంచ పోటీతత్వసూచీలో మనర్యాంకు 68.

ఇక లింగ సమానత్వంలో 112, ప్రజాస్వామ్యసూచిలో 51,సుస్థిరాభివృద్ధిలో 77, కొవిడ్‌- 19 ప్రభుత్వ ప్రతిస్పందన సూచీలో 73,ప్రపంచ సంతోషసూచి లో 144.

ప్రపంచ నవకల్పనల సూచీలో 52, ప్రపంచ అస మానతా సూచీలో 147,ప్రపంచ శాంతిసూచీలో 141, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిలో 140, అవినీతి సూచిలో 78, ప్రపంచ సురక్షిత నగరాలలో మన ముంబై 45వ స్థానంలో ఉంది.

ఈ సూచికలు మనం ఇంకా ఎంతో ప్రగతి సాధించాల్సి ఉందని తెలియచేస్తున్నాయి. భారతదేశం సమున్నతమైన ప్రగతిబాటలో పయనిస్తోంది.

ఈ ప్రయాణంలో అధిగమించాల్సిన ఎన్నో అవ రోధాలు,సవాళ్లు ఇంకా మిగిలి ఉన్నాయి..

దేశ జనాభాలో 6.7 శాతం మంది అనగా 73 మిలియన్ల మంది తీవ్ర పేదరికంలో ఉన్నారు.నిరుద్యోగం రేటు నేడు 5.36 శాతంగా ఉంది.

287 మిలియన్‌ మంది విద్యారంగానికి దూరంగా ఉన్నారు. ఆదాయ అసమానతలు తీవ్రంగా ఉన్నాయి. దేశంలోని పై తరగతి 10 శాతం జనాభా వద్ద 77శాతం జాతిసంపద పోగుపడి ఉంది.

ప్రస్తుతం ఒక గ్రామీణ కూలి తన రోజువారి సంపాదనలో 941 సంవత్సరాలు కష్టపడితే దేశంలోని కార్పొరేట్‌ కంపెనీ ఉన్నత ఉద్యోగికి ఒక సంవత్సరంవేతనానికి సమానమవు తుంది.

రాష్ట్రాల మధ్య ప్రాంతీయాభివృద్ధిలో అసమానతలు, నాణ్యతలేని అస మానవిద్య, పారిశుధ్యలేమి, వ్యర్థపదార్థాల అస్తవ్యస్థ నిర్వహణ, కాలుష్యభూతం చూస్తూనే ఉన్నాం.

మహిళలపై పెరుగుతున్నా అఘాయిత్యాలు,పోష కాహారలోపం, రైతు ఆత్మహత్యలు, నిజాయితీగల రాజకీయ నాయకుల కొరత, మంచినీటి సమస్య అపరిష్కృతంగానే ఉన్నాయి.

మౌలిక సదుపాయాల కొరతమొదలైన సమ స్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి.

2030 నాటికి సగటు భారతీయుని వయస్సు 31గా ఉండటం మరేదేశం కంటే కూడా మన శ్రామిక శక్తి ఎక్కువ అని స్పష్టమవుతుంది.

ఈ శక్తితోనే మనం కష్టపడి దేశాభివృద్ధికి బాటలు వేయాలి. పేదరికం, ఈతిబాధలు లేని సుస్థిర, శాంతికాముక, సంతోషకర భారత్‌ను నిర్మించి భవిష్యత్‌తరాలకు మనం కానుకగా అందించాలి.

-తండ ప్రభాకర్‌ గౌడ్‌

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/